క్రికెట్ లో టెస్టులకి ఉండే ప్రాధాన్యతే వేరు. ఒకరోజు మొత్తం ఆట ఆడాలంటే చాలా ప్రాక్టీసు ఉండాలి. అందుకే టెస్టులు ఆడాలేని వాళ్ళని ఆటగాళ్ళ కింద జమ కట్టరు. ట్వంటీ ట్వంటీల్లో రాణించే మేటి ఆటగాళ్ళు సైతం టెస్టుల్లో చతికిల పడుతుంటారు. అసలు టెస్ట్ క్రికెట్ లోనే అసలు మజా ఉంటుందనేది ఆటగాళ్ళ నమ్మకం. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ లోనే అసలైన వ్యూహాలు పన్నడానికి వీలుంటుందనేది వారి వాదన.


అయితే రాను రాను టెస్ట్ క్రికెట్ ఆదరణ తగ్గుతోంది. పొట్టి క్రికెట్ వచ్చినప్పటి నుండి సుదీర్ఘ మ్యాచెస్ ఆడడానికి ఇష్టపడట్లేదు. అయితే ఇలాంటి సందర్భంలో డే నైట్ టెస్ట్ లు ఆడితే ఎలా ఉంటుంది. టెస్ట్ లన్నీ డే లోనే ఉంటాయి. కానీ కొన్నాళ్ళ క్రితం నుండి డేనైట్ టెస్ట్ లు కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ డేనైట్ టెస్ట్ లలో వైట్ బాల్ కి బగులు పింక్ బాల్ ని ఉపయోగిస్తారట. మన జట్టుకి పింక్ బాల్ తో ప్రాక్టీసు లేదు.


అయితే ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడైన గంగూలీ డేనైట్ టెస్ట్ ఆడించాలని చూస్తున్నాడు. టెస్ట్ లకి ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో డే నైట్ టెస్ట్ లు ఆడించి మళ్ళీ టెస్ట్ ల మీద ఆదరణ పెరిగే ప్రయత్నం చేయడానికి పూనుకుంటున్నాడు. ఇటు భారత ఆటగాళ్లను, అటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును రెండు రోజుల వ్యవధిలోనే ఒప్పించి వచ్చే నెల 22న తన సొంతగడ్డ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పింక్ టెస్టు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశాడు.


ఇంత తక్కువ వ్యవధిలో ఇంతమందిని ఒప్పించి డేనైట్ టెస్టు అంత సులువైన విషయం కాదు.కానీ గంగూలీ ఆ పని చేసి చూపించాడు. భారత సారధిగా ఎన్నో విజయాలని అందించిన గంగూలీ ఈ మాత్రం చర్యలకి పూనుకోవడం మంచిదే.



మరింత సమాచారం తెలుసుకోండి: