ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లేన్ మాక్స్ వెల్   మానసిక  సమస్యల కారణంగా  కొంత కాలం  అంతర్జాతీయ  క్రికెట్  కు విరామం ప్రకటించాడు.  కొన్ని నెలలుగా మాక్స్ వెల్ మానసిక ఆరోగ్య  సమస్యలతో  బాధపడుతున్నాడు దాంతో అతను  కొంత కాలం  క్రికెట్ కు దూరంగా ఉండాలని  నిర్ణయించుకున్నాడని  ఆసీస్ ఫిజియో మైఖేల్  లాయిడ్  వెల్లడించాడు. 




ఇక మాక్స్ వెల్  తప్పుకోవడంతో  అతని స్థానంలో శ్రీలంక తో మూడో టీ 20 కోసం  డిఆర్సీ షార్ట్  ను ఎంపిక చేసింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.  కాగా   ఇటీవల జరిగిన  ప్రపంచ కప్ లో లో దారుణంగా నిరాశపరిచిన   మాక్స్ వెల్   తాజాగా శ్రీలంక తో జరిగిన  మొదటి టీ 20లో  28బంతుల్లోనే  62 పరుగులతో  మెరుపులు మెరిపించి ఫామ్ లోకి వచ్చాడు. అయితే రెండవ టీ 20 లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక మూడవ టీ 20 కి   ముందు మాక్స్ వెల్  అనుహ్యంగా  క్రికెట్ నుండి కొంత కాలం తప్పుకుంటున్నట్లు  ప్రకటించి  అభిమానులకు షాక్ ఇచ్చాడు. మరి వచ్చే ఏడాది  సొంత గడ్డపై జరుగనున్న  టీ 20 ప్రపంచ కప్  సమయానికైనా మాక్స్ వెల్  తిరిగి జట్టులో చేరుతాడో  లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: