క్రికెట్ చరిత్రలో  ఇటీవల మొదటి సారి వన్డే ప్రపంచ కప్ నుగెలుచుకొని  ఫుల్ జోష్ వున్న ఇంగ్లాండ్..   ఆతరువాత ఆస్ట్రేలియా తో  జరిగిన యాషెస్ సిరీస్ ను డ్రా చేసుకుంది.  ఇక ప్రస్తుతం ఆ జట్టు  న్యూజిలాండ్ లో పర్యటిస్తుంది.  అందులో భాగంగా  శుక్రవారం  ఆతిథ్య  జట్టు న్యూజిలాండ్ తో జరిగిన  మొదటి టీ 20 మ్యాచ్  లో ఏడు వికెట్ల తేడాతో  ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  కివీస్ నిర్ణిత  20ఓవర్ల లో  5వికెట్ల నష్టానికి  153 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ లలో రాస్ టేలర్  44పరుగులతో  టాప్ స్కోరర్  గా నిలిచాడు. 




అనంతరం  ఛేదనకు దిగిన ఇంగ్లీష్ జట్టు ఆడుతూ పాడుతూ 18.3 ఓవర్ల లో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి  లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లాండ్  బ్యాట్స్ మెన్ లలో జేమ్స్ విన్సీ 59పరుగుల తో టాప్ స్కోరర్ గా నిలువగా  బెయిర్ స్టో  35 , కెప్టెన్ మోర్గాన్ 34 పరుగులతో  రాణించారు.   విన్సీ కి   మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.  5 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండవ టీ20 ఈనెల 3న వెల్లింగ్టన్ లో జరుగనుంది. ఇక ఈసిరీస్ కు  న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్  అలాగే స్టార్ పేసర్  ట్రెంట్  బౌల్ట్ అందుబాటులో లేరు. దాంతో ప్రస్తుతం టీ 20 జట్టుకు  సౌథీ  కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈపర్యటనలో  ఇంగ్లాండ్ , న్యూజిలాండ్ తో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కూడా ఆడనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: