టీమిండియా  మాజీ ఓపెనర్  సెహ్వాగ్ తో తనను పోల్చవద్దని  కోరాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇటీవల సౌతాఫ్రికా తో జరిగిన  టెస్ట్ సిరీస్ లో  ఓపెనర్ గా వచ్చి  రోహిత్  సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మొదటి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో రెండు సెంచరీ లు  చేసి  దూకుడుగా ఆడడంతో  అప్పటినుండి  రోహిత్ ను  అందరు భారత జట్టుకు  మరో సెహ్వాగ్ దొరికాడంటూ పోల్చడం మొదలెట్టారు. 



తాజాగా  బంగ్లాదేశ్ తో టీ 20 సిరీస్ కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ ..ఈవిషయం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.  సెహ్వాగ్ఓ లెజెండ్  అతని తో నన్ను పోల్చవద్దు.  అయితే  అతని తో కలిపి నా పేరు  వినబడుతున్నందుకు  సంతోషమే ..  మేమిద్దరం ఒకేలా  ఆడతామని జనం అనుకుంటున్నారు కానీ సెహ్వాగ్‌ సెహ్వాగే.  క్రికెట్‌లో అతడు ఎంతో సాధించాడు. నేను ఎలా ఆడాలని టీమ్‌ అనుకుంటుందో అలా ఆడటానికి ప్రయత్నిస్తున్నానని  అన్నాడు.  అలాగే  టెస్టులో ఓపెనర్‌గా  సక్సెస్  అవ్వడం  సంతోషంగా ఉందని చెప్పాడు.  ఓపెనర్‌గా ముందుగానే వచ్చివుంటే బాగుండేమోనన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందన్నాడు. ఈడెన్‌ గార్డెన్‌లో జరగబోయే డే నైట్  టెస్ట్‌ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. ఇక  భారత్ - బంగ్లాదేశ్ జట్ల  మధ్య రేపు ఢిల్లీ లో మొదటి టీ 20 మ్యాచ్ జరగనుంది.  ఈ సిరీస్ కు కోహ్లీ కి విశ్రాంతినివ్వడం తో  రోహిత్ సారథిగా వ్యవహరించనున్నాడు.   


మరింత సమాచారం తెలుసుకోండి: