హైదరాబాద్ ఎఫ్‌సీ టీమ్ మరియు కేరళ బ్లాస్టర్స్‌ మధ్య మ్యాచ్ GMC బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో,(గచ్చిబౌలి) ఈరోజు సాయంత్రం 7:30 గంటలకు జరగనున్నది.  
వరుసగా చివరి రెండు మ్యాచ్స్ లో పరాజయం పొందిన హైదరాబాద్ ఎఫ్‌సీ, ఎలాగేనా తన సొంతగడ్డ పై విజయం సాధించాలని తపన పడుతుంది. కానీ, హైదరాబాద్ జట్టు కోచ్ ఫిల్‌ బ్రౌన్‌ తమ విజయం పై సందేహపడుతున్నాడు. ఎందుకంటే, కీలకమైన ప్లేయర్స్ అంత ఇంజురీ లిస్ట్ లో ఉన్నారు. 


తమ సొంత సపోర్టర్స్ ముందు విజయం సాధిస్తే గట్టి విశ్వాసం తమకి లభిస్తుందని ఫీల్ బ్రౌన్ మీడియా తో చెప్పుకొచ్చారు. తమ జట్టు కి ఒక విజయం దొరుకుతే చాలని వాళ్ళెంటో ఫుట్బాల్ గేమ్ లో నిరూపించుకుంటాం అని ఫీల్ బ్రౌన్ చెప్పారు.


ఒక విజయం సాధిస్తే అన్ని విషయాలు మారిపోతాయని, ఆ విజయం తొందర్లోనే సాధించాలని ఆశిస్తున్నాని జట్టు కోచ్ చెప్పారు. ఫీల్ బ్రౌన్ చెప్పిన ప్రకారం హైదరాబాద్ ఎఫ్‌సీ టీమ్ తన హోమ్ గ్రౌండ్ లో జరిగే రెండు మ్యాచ్స్ లో గెలిచి తమ ఆడియెన్సున్ని గర్వపడేలా చేయాలనుకుంటుంది. 


ఇక రెండు జట్ల విషయానికి వస్తే, హైదరాబాద్ జట్టు డిఫెన్స్ చేయడం లో చాలా బలహీనంగా ఉంది. ఏటీకె తో ఆడిన మ్యాచ్ లో రఫా లోపెజ్ బాగా గాయపడడంతో ఈరోజు జరిగే మ్యాచ్ లో పాల్గొనలేకపోతున్నాడు. హైదరాబాద్ జట్టు లో ఆశీష్ రాయ్ మరియు ళల్డంమావియే రాల్ట్, రాబిన్ సింగ్ మరియు మార్చేలింహో తో కలిసి ఆడనున్నారు. కేరళ బ్లాస్టర్స్ లో సహల్ అబ్దుల్ సమద్ మిడిఫీల్డ్లో కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: