ఒక 4 నెలల క్రితం బాల్ టాంపరింగ్ ఉదంతంలో సంవత్సరం పటు నిషేధం ఎదురుకొని మరల అన్ని ఫార్మాట్లలో తిరిగి వచ్చి తన విశ్వరూపం చుపిస్తున బ్యాట్స్ మాన్ డేవిడ్‌ వార్నర్‌. ఇటీవల ఇంగ్లాండ్‌ తో జరిగిన యాషెస్ సిరీస్‌ లో పూర్తిగా విఫలమైన ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ శ్రీలంకతో జరిగిన మూడు టీ - 20 ల సిరీస్‌ లో అద్భుతంగా రాణించాడు ఈ స్టార్ బ్యాట్స్ మాన్. 


ఆ సిరీస్‌లో మొత్తం 217 పరుగులు చేసిన అతడు మూడు మ్యాచ్‌ల్లో పూర్తిగా నాటౌట్‌గా నిలిచి పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, కివీస్‌ ఆటగాడు కొలిన్‌ మన్రో ఇది వరకు ద్వైపాక్షిక మూడు టీ - 20 ల సిరీస్‌లో, మూడు మ్యాచ్‌ ల్లోనూ అర్ధ శతకాలు సాధించిన ఆటగాళ్లుగా నిలిచారు.


డేవిడ్ వార్నర్‌ శుక్రవారం జరిగిన మూడో టీ20లో అర్ధశతకం బాదడంతో వారిద్దరినీ వెనక్కినెట్టాడు. 2015-16 సంవత్సరం సీజన్‌లో ఆసీస్‌ పర్యటన సందర్భంగా కోహ్లీ వరుసగా 90 నాటౌట్‌, 59 నాటౌట్‌, 50 పరుగులు చేశాడు. దీని తరువాత 2017-18 సీజన్‌ లో కొలిన్‌ మన్రో విండీస్‌ పై 53, 66, 104 పరుగులు చేశాడు. ఇది  ఇలా ఉండగా ప్రస్తుతం ఆసీస్‌ ఓపెనర్‌ మూడు మ్యాచ్‌ల్లోనూ నాటౌట్‌గా నిలిచి వారిద్దరినీ వెనక్కినెట్టాడు. 


తొలి మ్యాచ్‌లో (100), రెండో మ్యాచ్‌లో (60), మూడో మ్యాచ్‌లో (57) పరుగులు చేశాడు డేవిడ్ వార్నర్. శుక్రవారం నాడు మ్యాచ్‌ లో అర్ధశతకం చేయడంతో వార్నర్‌ టీ - 20 ల్లో 900 పరుగులు చేసిన ఏకైక ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ గా రికార్డు సృష్టించాడు. అలాగే ఈ మ్యాచ్‌ లో ఒక సిక్స్‌ బాదడంతో ఆస్ట్రేలియా తరపున వంద సిక్సులు బాదిన రెండో క్రికెటర్‌గా వార్నర్ నిలిచాడు. అంతకన్నా దీని ముందు మాజీ కీపర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ 105 సిక్సులు బాదాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: