ఢిల్లీ  లో జరిగిన మొదటి  వన్డే లో  భారత్  పై 7వికెట్ల తేడాతో  బంగ్లాదేశ్  ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి  బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకొని ..బ్యాటింగ్ కు దిగిన  భారత్ కు ఆరంభం లోనే షాక్ ఇచ్చింది.   భీకర ఫామ్ లో వున్న రోహిత్ శర్మను   9పరుగులే  పెవిలియన్ పంపించాడు  బంగ్లా  బౌలర్ షఫీయుల్.. ఆతరువాత  రాహుల్ కూడా వెంటనే  అవుట్ కాగా  నాల్గో  స్థానం లో  వచ్చిన శ్రేయాస్ అయ్యర్ దూకుడు గా ఆడుతూ నెమ్మదిగా  కదులుతున్న స్కోర్  బోర్డు ను పరుగులు పెట్టించాడు. 
 అదే క్రమంలో  శ్రేయాస్  భారీ షాట్ కు యత్నించి  లాంగ్ ఆన్ లో దొరికిపోయాడు.  ఆ తరువాత వచ్చిన పంత్ కుదురుకోవడానికి సమయం తీసుకోగా   శిఖర్ ధావన్  దూకుడు పెంచాడు.  అయితే  సొంత గడ్డపై  మెరుపులు మెరిపించే క్రమంలో  పంత్ చేసిన  పొరపాటుకు ధావన్ రన్ ఔట్  గా వెనుదిరిగాల్సి వచ్చింది . 



ఇక అరంగేట్రం ఆటగాడు శివమ్ దూబే దారుణంగా నిరాశపడిచాడు.  తాను ఏదుర్కొన్న నాల్గో బంతిని  చెత్త గా ఆడి బౌలర్ కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటైయ్యాడు. ఆతరువాత వెంటనే పంత్ కూడా  తనకు అలవాటైన  రీతిలో ఔట్  కావడంతో  భారత్ స్కోర్  120 దాటితే  గొప్పే అనిపించింది.  కానీ చివర్లో  వాషింగ్టన్ సుందర్ , కృనాల్ పాండ్య మెరుపులు మెరిపించడం తో  చివరి రెండో ఓవర్లలో 30 పరుగులొచ్చాయి.  దాంతో  భారత్  నిర్ణీత  20ఓవర్లలో  6వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. 41పరుగులతో  శిఖర్ ధావన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.   



అనంతరం లక్ష్య చేధనకు  దిగిన  బంగ్లా ఎనిమిది పరుగులకే మొదటి వికెట్ కోల్పోగా  మరో ఓపెనర్ నయిం తో కలసి సౌమ్య సర్కార్  ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు.  అయితే 54 పరుగుల వద్ద  నయిం  కూడా వెనుదిరిగినా  సౌమ్య సర్కార్ అండతో   ముష్ఫికర్ రహీమ్  అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి  బంగ్లా ను  విజయానికి చేరువచేశాడు.  ఈ దశలో సౌమ్య సర్కార్  ఔట్ కాగా   కెప్టెన్ మహమ్మదుల్లా తో కలిసి ముష్ఫికర్ రహీమ్   లాంఛనాన్ని పూర్తి చేయడమే  కాకుండా  60పరుగులతో అజేయంగా నిలిచి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు ను సొంతం చేసుకున్నాడు. ఇక  టీ 20ల్లో  భారత్  తో బంగ్లాదేశ్  ఇప్పటివరకు  9మ్యాచ్ లు ఆడగా  ఎట్టకేలకు మొదటి విజయాన్ని నమోదు చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: