ఢిల్లీలో  ఆదివారం  బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టీ 20  లో భారత్ అన్ని విభాగాల్లో  విఫలమయ్యి  పరాజయాన్ని చవి చూసింది.  ముఖ్యంగా  మూడు పొరపాట్లు  భారత్ కొంపముంచాయి. అందులో భాగంగా బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్   6పరుగుల వద్ద  వున్నపుడు  చాహల్  బౌలింగ్ లో ఎల్బీ కి అప్పీల్ చేయగా  ఎంపైర్ దాన్ని తిరస్కరించాడు. రీప్లే లో మాత్రం  అది ఔట్ గా తేలింది.  అప్పటికి భారత్ కు రివ్యూ వున్నా దాన్ని వినియోగించుకోలేకపోయింది.  ఇక  రెండవది  ఫీల్డింగ్ ...   లో  స్కోరింగ్ గేమ్ లో  మ్యాచ్ విజయం లో కీలక పాత్ర వహించేది ఫీల్డింగే.   అయితే ఈవిషయం లో  భారత  ఫిల్డర్లు తీవ్రంగా నిరాశపరిచారు.  ఒక్క కెప్టెన్ రోహిత్ శర్మ తప్ప  ఫీల్డింగ్ లో ఎవరు మెరవలేదు.



 ముఖ్యంగా మ్యాచ్  హోరా హోరి గా   జరుగుతునప్పుడు  లాంగ్ ఆన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న  కృనాల్  పాండ్య,  18ఓవర్ లో ముష్ఫికర్ రహీమ్ ఇచ్చిన సునాయాస క్యాచ్ ను  నేలపాలు చేశాడు.   ఆతరువాతి ఓవర్లోనే  వరుస బౌండరీలతో రెచ్చి పోయి  రహీమ్ మ్యాచ్ ను   దూరం చేశాడు.   ఆ క్యాచ్ గనుక పట్టుంటే  మ్యాచ్ మన చేతుల్లోకి వచ్చేదే. ఇక  డెత్ ఓవర్లో  అనుభవమేలేమి  బౌలర్  తో  టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. అప్పటివరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ ను 19ఓవర్ లో ఖలీల్ అహ్మద్  చెత్త బంతులు వేసి  మ్యాచ్ ను దూరం చేశాడు.  ఆ ఓవర్ లో చివరి నాలుగు బంతుల్లో  నాలుగు  ఫోర్లు కొట్టి  ముష్ఫికర్ రహీమ్   బంగ్లా విజయాన్ని ఖాయంచేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: