ధోని స్థానాన్ని భర్తీ చేస్తాడని నమ్మి వరుసగా అవకాశాలిస్తున్నా  తన ఆట  తీరును  మార్చుకోకుండా  విమర్శలపాలవుతున్నాడు టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్.  ఒక్క బ్యాటింగ్ లోనే కాదు వికెట్ల వెనకాల కూడా  అతను అట్టర్ ప్లాప్ అవుతున్నాడు.  డీఆర్ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టమ్ అనేలా  ధోని  చేస్తే పంత్ మాత్రం  సమీక్షల విషయం లో దారుణంగా తేలిపోతున్నాడు. తాజాగా ఢిల్లీ లో బంగ్లాదేశ్  తో జరిగిన  మొదటి టి 20మ్యాచ్ లో పంత్  అన్నిరకాలుగా నిరాశపరిచాడు.  సుదీర్ఘ ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన జట్టు కు  ఉపయోగపడే స్కోర్ చేయలేకపోయాడు. వచ్చి రాగానే  దూకుడుగా ఆడుతునట్లు కనిపించిన  శిఖర్ ధావన్ రన్ ఔట్ చేయించాడు. ఆతరువాత కూడా  క్రీజ్ లో  పాతుకపోవడానికే  ఆసక్తిని చూపించిన పంత్  ఓవర్లు  అయిపోతున్నాయనే  క్రమంలో పసలేని  షాట్ తో మరో సారి తనకు అలవాటైన రీతిలో  ఔటైయ్యాడు. 




 ఇక పంత్  వికెట్ల  వెనుకాల  కూడా  దారుణంగా నిరాశపరిచాడు. బంగ్లా స్టార్ బ్యాట్స్ మెన్ ముష్ఫికర్ రహీమ్  6పరుగుల వద్ద వున్నప్పుడు ఎల్బీ  నుండి అవుట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు.  రిప్లై లో అది ఔట్  అని తేలినా  కీపర్ నుండి ఎలాంటి  రెస్పాన్స్ రాకపోవడంతో  రోహిత్  రివ్యూ తీసుకోలేదు.  ఆతరువాత కొద్దీ సేపటికే సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.  దాంతో రెండో సారి కూడా రహీమ్ ఎల్బీడబ్ల్యూ  నుండి తప్పించుకున్నాడు.  అయితే అవసరమైనప్పుడు కాకుండా అనవసరమైన దానికి  కోసం పంత్ , రోహిత్ ను రివ్యూ  కు ఒప్పించాడు. 10ఓవర్ లో సౌమ్య సర్కార్  బ్యాటింగ్ చేసే క్రమంలో బంతి బ్యాట్ కు  తాకితాకనట్లుగా  వెళ్లి పంత్ చేతిలో  పడింది.  దాంతో  అప్పీల్ చేయగా ఎంపైర్ తిరస్కరించాడు.  ఆతరువాత భారత్  రివ్యూ తీసుకున్న ఫలితం వ్యతిరేకంగానే వచ్చింది.  అలా  రివ్యూను వృధా చేశాడు. దాంతో  ధోని  అభిమానులు..  ఇదే ఆట తీరు కనబరిస్తే  ధోని  దరిదాపుల్లోకి   కూడా  రాలేవు , చెత్త కీపింగ్ అంటూ పంత్  పై  ఫైర్ అవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: