భార‌త్‌లో ప్ర‌తి యేటా వేస‌విలో జ‌రిగే ఐపీఎల్ ప్ర‌పంచ క్రికెట్‌కే స‌రికొత్త భాష్యం నేర్పింది. క్రికెట్ అభిమానులను ఉర్రూత లూగించే ఐపీఎల్ క్రికెట్ ఫార్మాట్ 2008లో ప్రారంభ‌మ‌వ్వగా అప్ప‌టి నుంచి ఎన్నో సంచ‌ల‌నాల‌తో దూసుకు వెళుతోంది. ఈ క్రికెట్‌కు మ‌రింత ఆక‌ర్ష‌ణ కోసం బీసీసీఐ వ‌చ్చే ఐపీఎల్ నుంచి స‌రికొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి తీసుకు రానుంది. వ‌చ్చే ఐపీఎల్ నుంచి కొత్తగా ఆటగాళ్లకు సంబంధించి ‘పవర్ ప్లేయర్’ విధానాన్ని అమల్లోకి తేవాలనుకుంటోంది.


ఇక‌పై ప్ర‌తి జ‌ట్టుకు 15 మంది ఆట‌గాళ్లు ఉంటారు. మైదానంలో 11 మంది ఉంటే మిగిలిన న‌లుగురిని ఆ టీంలు ఎప్పుడు కావాలంటే అప్పుడు సబ్ స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓ వికెట్ పడిన తర్వాత లేదా ఓవర్ ముగిసిన తర్వాత ఆటగాళ్లను సబ్ స్టిట్యూట్ చేసుకునే వీలుంటుంది. ఇది పాల‌నా మండ‌లిలో ఆమోదించాక అమ‌ల్లోకి రానుంది. ఓ వికెట్ ప‌డితే న‌లుగురు స‌బ్‌స్టిట్యూట్ ఆట‌గాళ్ల‌లో ఎవ‌రైనా బ్యాటింగ్‌కు దిగ‌వ‌చ్చు. లేదా ఓవ‌ర్ ముగియ‌గానే మ‌రో బౌల‌ర్ వారికి బ‌దులుగా మైదానంలోకి రావొచ్చు.


ఈ పద్ధతిని ఐపీఎల్ లో ప్రవేశపెట్టే ముందు ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. ఇక చివ‌రి 6 బంతుల్లో 20 ప‌రుగులు చేయాల‌నుకోండి... అప్పుడు క్రీజ్‌లో ఉన్న ఆట‌గాడికి బ‌దులుగా హిట్ట‌ర్ ఆట‌గాళ్లు క్రిస్ గేల్ లాంటి వాళ్లు  (బెంచ్ మీదున్న ఆడవలసిన ఆటగాళ్లలో) ఉంటే వారిని సబ్ స్టిట్యూట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ చేస్తున్న జట్టు పరంగా చూస్తే.. చివరి ఓవర్లో పరుగులేమీ ఇవ్వకుండా ప్రత్యర్థి జట్టును నియంత్రించడానికి డగౌట్ లో ఉన్నబుమ్రాను బౌలర్ గా దించి ఆ ఓవర్ ను వేయించే అవకాశముంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: