క్రికెట్  చరిత్రలోనే  మోస్ట్ సక్సెస్ ఫుల్ లీగ్ గా వెలుగొందుతూ  ప్రతి సీజన్  లో కాసులు కురిపిస్తున్న లీగ్.. ఐపీఎల్.  ఈలీగ్ ను ఇప్పుడు మరింత  ఆకర్షణగా మార్చేందుకు   బీసీసీఐ   సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా  పవర్ ప్లేయర్ అనే సరికొత్త ఆప్షన్ ను  వచ్చే ఏడాది  ఐపీఎల్ లోప్రవేశపెట్టనున్నారని  తెలుస్తుంది. ఈ పవర్ ప్లేయర్  ఆప్షన్ గురించి   క్లుప్తంగా  చెప్పాలంటే..  ఒక వికెట్  పడగనే లేదా ఓవర్ ముగియగానే  తుది జట్టులో  లేని ఆటగాన్ని ఒకరిని సబ్ స్టిట్యూట్ గా తీసుకోవచ్చు.  అయితే ఆ ప్లేయర్  15మంది జట్టు సభ్యుల్లో ఒకడై ఉండాలి. అందుకోసం  జట్లు11మంది తో కూడిన టీంను    కాకుండా  15మందిని ప్రకటించాల్సి ఉంటుంది.  



ఉదాహరణ కు  ఛేజింగ్ టీం  చివరి ఓవర్లో  20పరుగులు  చేయాల్సివచ్చినప్పుడు  19ఓవర్ ముగిశాక  లేక  వికెట్ పడ్డాక ఆ రన్స్  చేసే  సామర్థ్యం వున్న ఆటగాడు  తుది జట్టులో లేకున్నా  పవర్ ప్లేయర్ విధానం ద్వారా అతన్ని  బ్యాటింగ్ కు పంపించవచ్చు.  ఇదే రూల్  బౌలింగ్ లో కూడా  వర్తిస్తుంది.  ఉదాహరణకు  ఒక ఓవర్ లో  6 పరుగులు  కాపాడాలి అనుకోండి ఆ సామర్ధ్యం వున్నా  బౌలర్ తుది జట్టులో  లేకున్నా 15మంది  జాబితాలో చోటు సంపాదించుకుంటే చాలు  అతను వెళ్లి ఆ ఓవర్ బౌలింగ్ చేయవచ్చు.  దీనివల్ల మ్యాచ్ లు మరింత  రసవత్తరంగా  జరుగుతాయని  బీసీసీఐ  ఆశిస్తుంది.  ఈ పవర్ ప్లేయర్ విధానాన్ని రానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ 20 లీగ్ లో ప్రవేశ పెట్టి పరీక్షించనున్నారు. అన్ని కుదిరితే  వచ్చే ఐపీల్ సీజన్  లో ఈ పవర్ ప్లేయర్  అందుబాటులోకి రావడం  పక్కా. 


మరింత సమాచారం తెలుసుకోండి: