వరుసగా పది టీ20 మ్యాచ్‌లు గెలిచిన రోహిత్‌సేనకు కివీస్‌ బ్రేక్‌ వేసింది. న్యూజిలాండ్‌ జట్టు  క్రికెట్‌లో తమ సత్తాను భారీగా భారత క్రికెటర్లకు రుచి చూపించింది. బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఏ దశలోనూ అవకాశమివ్వకుండా ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 219 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా బ్యాట్స్‌మన్లు ఘోరంగా విఫలమవ్వడంతో 80 పరుగుల తేడాతో ఓడి నిరాశపర్చింది. 


న్యూజిలాండ్ ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడ‌వ‌ టీ20 మ్యాచ్‌లో  విక్ట‌రీ సాధించింది.న్యూజిలాండ్ నెల్స‌న్‌లో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో 14 ప‌రుగుల తేడాతో  నెగ్గింది.  కివీస్ మొదటిలో కొంచెం అటు ఇటు ఆడిన , తొలుత నిర్ణీత ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 180 ర‌న్స్ చేసింది.

న్యూజిలాండ్‌ ప్లేయ‌ర్ల‌లో గ‌ప్తిల్ 33, టేల‌ర్ 27, గ్రాండ్‌హోమ్ 55 ర‌న్స్ చేశారు. 181 టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెన‌ర్లు మంచి స్టార్ట్ ఇచ్చారు. ఓపెన‌ర్ మాల‌న్ 55 ర‌న్స్ చేయ‌గా, మ‌రో ఓపెన‌ర్ బాంట‌న్ 18 ర‌న్స్ చేశాడు. ఇక వ‌న్‌డౌన్ బ్యాట్స్‌మెన్ జేమ్స్ విన్స్ అత్య‌ధికంగా 49 ర‌న్స్ చేశాడు.

ఓ ద‌శ‌లో ఇంగ్లండ్ కేవ‌లం 2 వికెట్లు కోల్పోయి 139 ర‌న్స్ చేసింది. దాదాపు విక్ట‌రీ ఖాయం అనుకున్న సంద‌ర్భంలో ఇంగ్లండ్ ప‌త‌నం ప్రారంభం అయ్యింది. కేవ‌లం 18 బంతుల తేడాలోనే 5 వికెట్లు కోల్పోయి.. ప‌ది ర‌న్స్ మాత్ర‌మే చేసింది. ఇక చివ‌రి ఓవ‌ర్‌లో 20 ర‌న్స్ చేయాల్సిన సంద‌ర్భంలో.. ఇంగ్లండ్ కేవ‌లం 6 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. టిమ్ సౌతీ ఆఖ‌రి ఓవ‌ర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ 14 ప‌రుగుల తేడాతో నెగ్గి.. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని సాధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: