గత ఏడాది రెండు సార్లు  బుకీలు  తనను సంప్రదించిన కూడా  ఐసీసీ అవినీతి నిరోధక  విభాగానికి సమాచారం ఇవ్వకుండా  బాధ్యాతా రాహిత్యంగా  వ్యవహరించిన  బంగ్లాదేశ్  స్టార్ ఆల్ రౌండర్  షకిబుల్ హాసన్ పై  రెండేంళ్ళ నిషేధం  విధించింది  ఐసీసీ.  దాంతో  అతను  ఇండియా పర్యటనకు  దూరమైయ్యాడు.  ఇక  పర్యటనకు ముందే షకిబుల్ రూపంలో   భారీ ఎదురుదెబ్బ తగలడంతో ఒత్తిడి లో  ఇండియా లో అడుగుపెట్టిన  బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం తో పర్యటనను ఘనంగా ఆరంభించింది.   అందులో భాగంగా ఢిల్లీ లో జరిగిన  మొదటి టీ 20 లో  భారత్ పై బంగ్లాదేశ్ 7వికెట్ల తేడాతో  గెలుపొందిన విషయం  తెలిసిందే.  బంగ్లా కు  టీ 20 ల్లో  టీమిండియా ను ఓడించడం ఇదే మొదటి సారి.  



ఇక ఈ విజయం పై  షకిబుల్  పేస్ బుక్  ద్వారా  స్పందించాడు.  ఒత్తిడి లో కూడా చాలా బాగా ఆడారు బాయ్స్ ..  మీ ప్రదర్శన తో దేశాన్ని గర్వించేలా చేశారు  కంగ్రాట్స్  అంటూ   షకిబుల్ హసన్  పేర్కొన్నాడు.  ఇక  మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా  రెండో టీ 20 ఈనెల  7న  రాజ్ కోట్ లో  జరగాల్సివుంది.  అయితే  ఈ మ్యాచ్ కు వాన గండం పొంచివుంది.  మహా తూఫాన్ సౌరాష్ట్ర , గుజరాత్ ల పై తీవ్ర ప్రభావం చూపించనుందని  వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: