ఇండియన్ క్రికెట్ కెప్టెన్ 'పరుగుల యంత్రం' విరాట్ కోహ్లీ తన 31వ పుట్టిన రోజును ఈరోజు జరుపుకుంటున్నాడు. అండర్‌-19 ప్రపంచకప్‌ను దేశానికి అందించిన కోహ్లీకి కొద్ది కాలంలోనే టీమ్‌ఇండియాలో చోటు దక్కింది. 2008లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో తన అంతర్జాతీయ క్రికెట్‌ను కోహ్లీ మొదలుపెట్టాడు. అంచెలుఅంచెలుగా ఎదుగుతూ టీం ఇండియా కి కెప్టెన్ అయ్యాడు. 


విరాట్ కోహ్లీ తన పుట్టిన రోజు వేడుకులను తన భార్య అనుష్క శర్మ తో గత ఏడాది ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ లో జరుపుకున్నాడు.  ఇక ఈ ఏడాది తన పుట్టిన రోజును అనుష్కతో కలిసి భూటాన్‌లో జరుపుకుంటున్నాడు. "అరుదైన రోజున, పవిత్రమైన పుణ్యక్షేత్రం భూటాన్‌లో నా భార్యతో కలిసి పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా వుంది, శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతీ ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు" అని కోహ్లీ తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసాడు.  ట్విట్టర్ లో కోహ్లీ తో అనుష్క శర్మ వున్న ఫోటో ని కోహ్లీ షేర్ చేసాడు. 


క్రికెట్ లో కి ప్రవేశించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తనకు ఎదురైనా అనుభవాలను తెల్పుతూ కోహ్లీ ఒక లేఖ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. జీవితం లో గమ్యమే మన హీరో అని లేఖ లో పేర్కొన్నాడు. "నేనేం చెప్పదలచుకున్నానంటే.. నీ కోసం జీవితం చాలా పెద్ద విషయాలనే దాచి ఉంచింది. నీ వద్దకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండు. ఏదేమైనా ముందుకు సాగడం మర్చిపోనని నిర్ణయం తీసుకో.


ఒకవేళ మొదటిసారి విఫలమైనా.. మళ్లీ ప్రయత్నించు. నిన్ను అభిమానించేవారు చాలా మంది ఉంటారు. అలాగే నువ్వు ఎవరో కూడా తెలియని వాళ్లు నిన్ను ఇష్టపడకపోవచ్చు. వాళ్లని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యం కలిగి ఉండు." అని లెటర్ లో భావోద్వేగంగా చెప్పాడు ఇండియన్ కెప్టెన్.


మరింత సమాచారం తెలుసుకోండి: