సోషల్ మీడియా వచ్చాక లాభం ఎంత జరిగిందన్నది పక్కన పెడితే నష్టాలు మాత్రం ఎక్కువే జరుగుతున్నాయి. తమకు నచ్చని వ్యక్తులని టార్గెట్ చేసి ట్రోలింగ్స్ చేస్తుంటారు. ఈ సంస్కృతి రోజు రోజుకీ పెరుగుతుంది. చాలా మంది సెలెబ్రిటీలు ఈ ట్రోలింగ్ ని ఎదుర్కొన్నవారే. సినిమా వారి నుండి రాజకీయ నాయకుల దాకా ఎవరినీ వదలకుండా ట్రోలింగ్స్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం భారత క్రికెట్ టీమ్ ప్రధాన కోచ్ ఇలాంటి ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటున్నాడు.  


ప్రపంచకప్ నుండి భారత్ నిష్క్రమణ జరిగిన నాటి నుండి రవి శాస్త్రి నెటిజన్లకు టార్గెట్ అయ్యాడు. ప్రపంచకప్ లో భారత్ పేలవ ప్రదర్శనకి కారణం రవిశాస్త్రినే అని విమర్శలు వచ్చాయి. అంతే కాదు, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ సమస్యను పరిష్కరించడంలో రవిశాస్త్రి విఫలమయ్యాడని అన్నారు. అంతేకాకుండా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ధోని బ్యాటింగ్‌ ఆర్డర్‌ మార్పుపై కూడా ధ్వజమెత్తుతున్నారు. 


ఇక తాజాగా దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో రవిశాస్త్రి నిద్ర పోయాడంటూ కొన్ని ఫోటోలు నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. ఇన్ని విమర్శల మధ్య మరో అంశం కూడా జోడైంది. మంగళవారం కెప్టెన్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా అందరూ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. రవి శాస్త్రి కూడా కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 


బర్త్‌డే విషెస్‌ తెలిపావు కానీ.. సరైన హ్యాష్ ట్యాగ్‌ ఇవ్వడం మర్చిపోయావ్‌’, బీసీసీఐ అధ్యక్షుడైన గంగూలీకి ఫిర్యాదు చేస్తూ, ‘గంగూలీ సర్‌.. మాకు(టీమిండియాకు) ఫిట్‌ కోచ్‌ కావాలి అని రవిశాస్త్రి కోచింగ్ సరిగా లేదని విమర్శిస్తున్నారు, ఇంకా ‘రవి మామా ఈ రోజు ఫుల్‌గా తాగుడేనా’, ‘ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో..సకల భోగాలు అనుభవిస్తున్నావ్ రవి‌..’అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరి ఈ కామెంట్లకి రవిశాస్త్రి స్పందిస్తాడా లేదా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: