పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా పేలవ ప్రదర్శనతో పలువురి విమర్శలని ఎదుర్కొంటుంది. ఒకప్పుడు దిగ్గజ ఆటగాళ్లతో ప్రపంచస్థాయి ప్రదర్శనతో ఆకట్టుకున్న పాకిస్తాన్ టీమ్ పేలవ ప్రదర్శనతో చతికిల పడుతోంది. గత కొన్ని రోజులుగా క్రికెట్ లో పాకిస్తాన్ ప్రదర్శన మరీ దారుణంగా ఉంది. స్వదేశంలో శ్రీలంకతో చిత్తుగా ఓడిపోయి పాక్ ప్రజల ఆగ్రహానికి గురయ్యింది. దీంతో పాకిస్తాన్ టీమ్ లో చాలా మార్పులు చేసి తిరిగి కొత్తగా తయారు చేశారు. 


ఈ ప్రక్షాళనలో భాగంగా పాకిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్ ని మార్చారు. కెప్టెన్ ని మార్చినా ఫలితం మాత్రం మారలేదు. మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్రదర్శనే ఇందుకు నిదర్శనం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఓపెనర్ గా దిగిన పఖర్ జమన్ రెండు పరుగులు చేసి ఔటయ్యాడు. 


ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ లలో హారిస్‌ సోహైల్‌(6), రిజ్వాన్‌(14), ఆసిఫ్‌ అలీ(4) పరుగులు చేసి ఔటయ్యారు. అప్పుడు కెప్టెన్ అయిన సారథి బాబర్‌ అజమ్‌50 (38 బంతుల్లో 6 ఫోర్లు) పరుగులతో చెలరేగి పోయాడు. అతనికి తోడుగా ఇఫ్తికర్ అహ్మద్ 62 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. దీంతో పాక్ కనీసం ఆ స్కోరునైనా సాధించగలిగింది. అనంతరం పాక్ పెట్టిన నూట యాభై ఒక్క పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ చాలా సులభంగా చేరుకుంది. 


ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ స్మిత్ తనదైన ఇన్నింగ్స్ తో పాక్ బౌలర్లని ఒక ఆట ఆడుకున్నాడు. 51 బంతుల్లో 11 ఫోర్లు ఒక సిక్సర్ తో 80 పరుగులు చేసి సునాయాసంగా విజయాన్ని అందించాడు. ఆసీసి మిగతా బ్యాట్స్ మెన్ అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ స్మిత్ కి అండగా నిలుచున్నారు. ఆసీస్ బ్యాటర్లలో వార్నర్‌(20), ఫించ్‌(17), బెన్ మెక్‌డెర్మాట్(21) పరుగులు చేశారు. మొత్తానికి 18.3 ఓవర్లలో  151 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది ఆసీసి టీమ్



మరింత సమాచారం తెలుసుకోండి: