ఇప్ప‌టి వ‌ర‌కు ఏ క్రికెట్ మ్యాచ్ లో అయినా ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్, రిజర్వ్ అంపైర్ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక మైదానంలో ఇద్ద‌రు అంపైర్లు ఉంటే థ‌ర్డ్ అంపైర్‌తో పాటు రిజ‌ర్వ్ అంపైర్ ఉంటుంటారు. అయితే ఇప్పుడు ఐపీఎల్‌లో మ‌రో అంపైర్ రంగంలోకి దిగ‌నున్నారు. 2020 ఐపీఎల్‌లో స‌రికొత్త నిబంధ‌న‌లు అమ‌ల్లోకి రానున్నాయి.


ఇప్ప‌టికే 15 మంది ఆట‌గాళ్ల‌ను తీసుకుని 4 గురు ఆట‌గాళ్ల‌తో రిజ‌ర్వ్ ప్లేయ‌ర్స్ సిస్ట‌మ్‌ను ప్ర‌వేశ‌పెట్టే అంశంపై ఇప్ప‌టికే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇక ఇప్పుడు 2020 ఐపీఎల్‌ లో తొలిసారి నోబాల్స్ ను మాత్రమే పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ అంపైర్‌ రానున్నాడు. గత ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ, ఎంఐ మధ్య జరిగిన మ్యాచ్ లో అంపైర్లు చాలా నోబాల్స్ గుర్తించ‌లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.


ఇక‌పై ఇలాంటి పొర‌పాట్లు పున‌రావృతం కాకుండా ఉండేందుకు ఐపీఎల్ బాడీ స‌రికొత్త అంపైరింగ్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఇది ఐపీఎల్‌లో ప్ర‌వేశ‌పెట్ట‌డానికి ముందే త్వ‌ర‌లో జరిగే ముస్తాక్ అలీ దేశవాళీ టీ-20లో నోబాల్ అంపైర్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాలని కూడా నిర్ణయించారు. ఇక రిజ‌ర్వ్ ఆట‌గాళ్ల‌తో ప‌వ‌ర్ ప్లేయ‌ర్ సిస్ట‌మ్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ బాడీ ఉత్సాహంగా ఉన్నా దీనికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ నుంచి అనుమతి లభించాల్సి ఉంది.


ఇక వ‌చ్చే సీజన్ కోసం డిసెంబర్ 19న కోల్ కతాలో ఆటగాళ్ల వేలం నిర్వహించాలని, 2019తో పోలిస్తే ఈసారి ఒక్కో ఫ్రాంచైజీ అదనంగా రూ. 3 కోట్ల వరకూ ఖర్చు పెట్టుకోవచ్చని కూడా కౌన్సిల్ నిర్ణయించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: