మరో సారి  ఛాంపియన్ గా నిలిచినా మను భాకర్‌,  అంతర్జాతీయ వేదికపై తన సత్తా చాటిన భారత యువ షూటర్‌ మను భాకర్‌ ఆసియా చాంపియన్‌గా అవతరించింది.హరియణాకు చెందిన 17 ఏళ్ల మను అను మహిళల మంగళవారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో  10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మను  ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన ఎనిమిది మంది షూటర్లు పాల్గొన్న ఫైనల్లో 244.3 పాయింట్లు స్కోరు చేసి టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది.

భారత్‌కి  చెందిన యశస్విని సింగ్‌ ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో  ఐదో స్థానంలో నిలిచింది.కియాన్‌ వాంగ్‌ చైనా–242.8 పాయింట్లుతో  రజతం గెలవగా ... కాంస్యంను  రాన్‌జిన్‌ జియాంగ్‌ చైనా–220.2 పాయింట్లుతో  కైవసం చేసుకుంది.  మను క్వాలిఫయింగ్‌లో 584 పాయింట్లు సాధించి టాప్‌ ర్యాంక్‌ హోదాలో ఫైనల్‌కు అర్హత సాధించింది.

మను భాకర్, యశస్విని (578), అన్ను రాజ్‌ సింగ్‌ (569)లతో కూడిన భారత బృందానికి టీమ్‌ విభాగంలో కాంస్యం లభించింది. క్వాలిఫయింగ్‌లో ఈ త్రయం సాధించిన స్కోరు ఆధారంగా ఈ పతకం ఖాయమైంది. మను భాకర్‌  గత ఎడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో, యూత్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లోనూ స్వర్ణ పతకాలను సాధించింది.


భారత షూటర్‌ దీపక్‌ కుమార్‌  పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఒకేసారి రెండు లక్ష్యాలను సాధించాడు. ఫైనల్లో అతను 227.8 పాయింట్లు స్కోరు చేసి కాంస్య పతకం నెగ్గడంతో పాటు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు కూడా అర్హత పొందాడు. యుకున్‌ లియు (చైనా–250.5 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... హావోనన్‌ యు (చైనా–249.1 పాయింట్లు) రజతం గెలిచాడు. మంగళవారం తన 32వ జన్మదినాన్ని జరుపుకున్న దీపక్‌ ప్రదర్శనతో... ఇప్పటి వరకు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత షూటర్ల సంఖ్య 10కి చేరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: