ఇకమీదట ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభ వేడుకలను నిర్వహించడంలేదు. తాజాగా బీసీసీఐ ప్రతి యేటా అద్భుతంగా..భారీ ఖర్చుతో జరిపే ఆరంభ వేడుకలను నిర్వహించకూడదని నిర్ణహించుకున్నట్లు వెలువడించింది. మిరుమిట్లు గొలిపే బాణసంచా తో ప్రముఖ బాలీవుడ్ నటుల ప్రదర్శన తో ఆరంభ వేడుకులను నిర్వహించినా.. క్రికెట్ అభిమానులు వాటిపై ఎటువంటి ఆసక్తిని చూపించకపోవడంతో ఓపెనింగ్ సెరిమోనీ ని డబ్బులు వృధాగా భావిస్తూ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 

 

 
2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి జరిగి 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్లు మరణించారు. దానితో ఆ దాడిలో అమరులైన జవాన్ల గౌరవార్థం ఫిబ్రవరి 2019వ సంవత్సరానికి సంబందించిన ఐపీఎల్ 10 సీజన్ ఆరంభ వేడుకులని బీసీసీఐ రద్దు చేసింది. ఆ కార్యక్రమానికి ఖర్చు చేయాల్సిన వ్యయాన్ని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు అందిస్తున్నామని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈసారి బీసీసీఐ తమ సంవత్సరం కాలంలో 30 కోట్లు మిగలవచ్చని వాటిని మంచి పనులకోసం కేటాయిస్తాం అని చెప్పుకొచ్చింది. 

 

 
ఇక జరగబోయే ఐపీల్ లో ఓ కొత్త అంపైర్ ని గ్రౌండ్ లోకి తీసుకువస్తున్నట్లు నవంబర్ 4న జరిగిన ఐపీల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ క్రికెట్ పాలక అధికారులు తెలిపారు. కొత్తగా వచ్చే ఈ అంపైర్ కేవలం నో-బాల్ లను గమనిస్తాడు. ఇలా ఇంకో ఇతర అంపైర్ ని గ్రౌండ్ లోకి తీసుకురావడం వలన నిర్ణయాలు తీసుకోవడం సులువవుతుందని బీసీసీఐ చెప్పింది. పోయిన సీజన్లో ఆర్ సి బి కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సి ఎస్ కే కీపర్ ఎంస్ ధోని నో బాల్ కి సంబందించిన నిర్ణయాలలో చాలా తప్పులు జరిగాయని విమర్శించారు. అందుకే ఈ ఇతర అంపైర్ ని కేవలం నో బాల్ లను చెక్ చేయడానికి తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: