పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన కామెంట్లు చేశాడు. రావల్పిండి ఎక్స్ ప్రెస్ గా ఫేరు గాంచిన షోయబ్ అక్తర్ ప్రస్తుత ఆటగాళ్లపై తనదైన కామెంట్లు చేస్తుంటాడు. అతను చేసిన కామెంట్ల్ వైరల్ అవుతుండడం విశేషం. తాజాగా అక్తర్ ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ పై కామెంట్లు చేశాడు. స్టీవ్ స్మిత్ మొన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో తన బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించి ఆసీస్ కి సునాయాసంగా విజయాన్ని అందించాడు.


ఆ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో కెఫ్టెన్ అయిన స్టీవ్ స్మిత్ స్మిత్‌ 51 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో అజేయంగా 80 పరుగులు సాధించి ఆసీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ గెలవడంతో ఆసీస్ ఒక మ్యాచ్ లీడ్ లో ఉంది. ఇప్పటికీ రెండు ట్వంటీ ట్వంటీ మ్యాచులు ఆడగా మొదటి మ్యాచ్ రద్దవగా రెండవ మ్యాచ్ ఆసీస్ గెలిచింది. ఆసిస్ ని స్మిత్ గెలిపించాడని అంతా అంటున్న నేపథ్యంలో షోయబ్ అక్తర్ కామెంట్స్ వైరల్ అయ్యాయి


అక్తర్ స్మిత్ గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు. అతని బ్యాటింగ్ లో ఎలాంటి స్టైల్ ఉండదు, టెక్నిక్ కూడా ఉపయోగించడు. కానీ ఆటపై ప్రభావం చూపే ఆటగాళ్ళలో అతడు ప్రథముడు.,నేను చాలా సందర్భాల్లో స్మిత్‌ను ఔట్‌ చేయడానికి ప్రయత్నించాను. బౌన్సర్లు రూపంలో బంతులు వేశా. కాకపోతే అతని టెక్నిక్‌ ఏమిటో అర్థం కాదు. అదే సమయంలో అతని ఆట  కూడా ఏమాత్రం సొగసైనదిగా ఉండదు.


స్మిత్‌ బంతిని ఎదుర్కొనే ధైర్యమే అతన్ని ఒక అసాధారణ క్రికెటర్‌గా మార్చింది. ఇటీవల తమ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్‌ ఆమిర్‌ బౌలింగ్‌లో బంతికి ఎక్కడైతే పిచ్‌  అవుతుందో అక్కడకి వచ్చి ఆడాడు. అలా ఆడడంతో నేను ఆశ్చర్యానికి గురయ్యాను. అది ఎలా సాధ్యమో అర్థం కాలేదు. ఒక టెక్నిక్‌, ఒక స్టైల్‌ అంటూ లేకుండా అలా ఎలా ఆడతారో నాకు తెలియట్లేదు. చివరకు అర్థమయ్యింది ఏంటంటే బంతిని ఖచ్చితంగా అంచనా వేసి ధైర్యంగా ఆడతాడు. అదే అతన్ని కీలక క్రికెటర్‌గా ఎదిగేలా చేసింది’ అని అక్తర్‌ పేర్కొన్నాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: