ఎవరెన్ని రికార్డులు చేసినా, ఏదో ఒకరోజు వాటిని బద్దలు కొట్టి తమ పేర రికార్డును రాసుకునే వారుంటారు. బ్యాటింగ్ లో ఒక రికార్డు మాత్రం ఎప్పటికీ చెరిపోదేమో అనిపిస్తుంది. అదే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు. అదీ ఒకే ఓవర్లో. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు’ఇది వినగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు యువరాజ్‌ సింగ్‌. 2007లో టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా స్టువార్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు.



ఇంత వరకు ఏ బ్యాట్స్ మెన్ కూడా ఆ రికార్డుని అందుకోలేకపోయాడు. ఆ రికార్డును సాధించి ఇన్ని రోజులవుతున్నా ఇంకా అలాగే ఉండడం ఆశ్చర్యమే. అసలు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం సాధ్యమా అని అనిపిస్తుంది. కొట్టడం సాధ్యమా అని అనిపిస్తుంది. ఏ  ఆటగాడైనా వరుసగా మూడు సిక్సర్లు బాదాడంటే యువరాజ్ లాగా ఆరు సిక్సర్లు కొట్టేస్తాడేమో అని ఆత్రంగా చూస్తారు. కానీ అది కుదరకపోయేసరికి ఉసూరుమంటారు. 


ఆటగాళ్ళు కూడా యువరాజ్ లాగా ఆరు సిక్సర్ లు కొట్టాలని అనుకొని ఉంటారు. అలా అనుకున్న వారిలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఒకరు. యువరాజ్ రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు సిక్సర్లు బాదుదామని అనుకున్నాడట. ఆ మ్యాచ్ లో బంగ్లా బౌలర్  మొసద్దిక్ వేసిన ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. దాంతో ఎలాగైనా ఆరు సిక్సర్లు బాది యువరాజ్ రికార్డును సమం చేద్దామని అనుకున్నాడట. 


కానీ మొసద్దిక్ చాలా తెలివిగా నాలుగో బంతి వేయడంతో అది కాస్తా డాట్ అయింది. దీంతో ఇక సిక్సులు కొట్టడం మానేసి సింగిల్స్ తీద్దామని అనుకున్నాడట. మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ ఈ విషయాన్ని బయటపెట్టాడు. వరుసగా మూడు సిక్సర్లు కొట్టగానే యువరాజ్ రికార్డు గుర్తొచ్చిందని, కానీ నాలుగో బంతి డాత్ అవడంతో కుదర్లేదని చెప్పుకొచ్చాడు. అయితే ఆ రికార్డుని ఎప్పటికైనా బద్దలు కొట్టాలంటే అది రోహిత్ తోనే సాధ్యమవుతుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: