టీం ఇండియాలో ఇద్దరు అన్నా తమ్ముళ్ళుగా గుర్తింపు పొందిన యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ లు అంతర్జాతీయ మ్యాచులు ఆడక చాలా రోజులవుతుంది. అయితే వీరిద్దరిలో ఇర్ఫాన్ పఠాన్ ఒక దక్షిణాది సినిమాలో కూడా కనిపిస్తాడట. మరికొద్ది రోజుల్లో ఆ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఆ విషయం అటుంచితే, ముఫ్పై ఏడేళ్ళ యూసఫ్ పఠాన్  2012 నుండి అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడట్లేదు. 


ఐపీఎల్ లో కనిపించే యూసఫ్ తనదైన ఆటతో అందరినీ ఆకట్టుకుంటాడు. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ ప్రతిభ కనబరిచే యూసఫ్ ఫీల్డింగ్ లోనూ మెరుపు వేగంతో కదులుతాడు. అయితే బరోడా టీమ్ తరపున ఆడుతున్న యూసఫ్ సయ్యద్ మస్తాక్ ఆలీ ట్రోఫీలో గోవాతో జరుగుతున్న మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ పట్టి చూపరులని ఆకర్షించాడు. యూసఫ్ ఆ క్యాచ్ పట్టగానే అందరూ ఆశ్చర్యపోయారు. 


బంతి తన నుండి దూరంలో వెళుతున్నా కూడా పక్షి లాగా అంత దూరం ఎగిరి దాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో బరోడా ఓడిపోయినప్పటికీ ఆ క్యాచ్ మాత్రం హైలైట్ గా నిలిచింది. అయితే యూసఫ్ పఠాన్ తమ్ముడయిన ఇర్ఫాన్ పఠాన్ ఆ క్యాచ్ పట్టిన వీడియోని ట్విట్టర్ షేర్ చేస్తూ... అలా ఎగురుతుంది పక్షి అనుకున్నా..కానీ జాగ్రత్తగా గమనిస్తే గానీ అది యూసఫ్ అని తెలియలేదు. 


యూసఫ్ నీ కష్టం వల్లే ఇది సాధ్యమైంది అని అతన్ని మెచ్చుకున్నాడు. ఇర్ఫాన్ ట్వీట్ కి స్పందించిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ తనదైన శైలిలో కామెంట్ చేశాడు. షోలే సినిమాలోని డైలాగుని గుర్తు చేస్తూ, అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నారు. పఠాన్ భాయ్ అంటూ యూసఫ్ ని పొగిడాడు. యూసఫ్ అంతర్జాతీయ మ్యాచులకి ఆడకపోయినా క్రికెట్ లో తన మార్క్ ని మాత్రం చూపెడుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: