ఆదివారం జరిగిన మూడవ టీ ట్వంటీలో బంగ్లాదేశ్, భారత్ జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. ఒక దశలో మ్యాచ్ చేజారిపోతుందేమో అన్న అనుమానం కూడా వచ్చింది. కానీ మన బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనతో భారత్ ని విజయ తీరాలకు చేరవేశారు. ఆ సమరంలో భారత్ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. సిరీస్ నిర్ణీత మ్యాచ్ లో భారత ఆటగాళ్ళు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 


ముఖ్యంగా భారత బౌలర్ దీపక్ చాహర్ తన బౌలింగ్ మాయాజాలంతో బంగ్లాదేశ్ ని మట్టి కరిపించాడు. కేవలం ఏడు పరుగులే ఇచ్చి ఆరు వికెట్లు తీసుకుని సరికొత్త రికార్డును సృష్టించాడు. టీ ట్వంటీ మ్యాచుల్లో తక్కుఅ పరుగులు ఇచ్చి ఎక్కువ వికెట్లు తీసుకున్న ఆటగాడిగా గుర్తింపు పొందాడు. దీపక్ చాహర్ తర్వాత అజంత మెండిస్ ఎనిమిది పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకుని రెండవ స్థానంలో,మూడవ స్థానంలో పదహారు పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్న అజంత మెండిస్, నాల్గవ స్థానంలో ఇరవై ఐదు పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసుకున్న భారత బౌలర్ యుజ్వేంద్ర చాహల్  లు ఉన్నారు.


అయితే ఇదే గాక దీపక్ చాహర్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు టీ ట్వంటీలో భారత్ తరపున హ్యాట్రిక్ తీసుకున్న మొదటి బౌలర్ గా గుర్తింపు పొందాడు. టీ ట్వంటీల్లో భారత బౌలర్లెవరూ హ్యాట్రిక్ సాధించలేదు. టెస్టుల్లో హ్యాట్రిక్ తీసుకున్న భారత బౌలర్లలో హర్భజన్ సింగ్, జస్ప్రిత్ బుమ్రా. ఇర్ఫాన్ పఠాన్ ఉండగా, వన్డేల్లో కపిల్ దేవ్, చేతన్ శర్మ, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ ఉన్నారు.  కానీ టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి భారత బౌలర్ గా దీపక్ చాహర్ గుర్తింపు పొందాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: