దీపక్ చాహర్. అప్పటి వరకు ఒక సాధారణ బౌలర్ గా ఇతడు ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.
పిచ్ మీద మంచు పడి బంతి వేయడానికి లేనటువంటి సమయంలో కూడా ఆరు వికెట్లు పడగొట్టడం అంత సులువు కాదు.  టీ ట్వంటీల్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన మొదటి మేల్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్నాడు.


ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో మొత్తం ఆరు వికెట్లు పడగొట్టాడు. అయితే ఆరు వికెట్లు పడగొట్టిన దీపక్ చాహర్ ఇచ్చిన పరుగులు ఏడు మాత్రమే. ప్రస్తుతం ఇది కూడా ఒక రికార్డే. బంగ్లాదేశ్ తో జరిగిన మూడు టీ ట్వంటీల సిరీస్ లో అతడు మొత్తం ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. దీనితో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో అత్యద్భుత ప్రదర్శన ద్వారా ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని బాగా మెరుగుపరుచుకున్నాడు. 


ఈ రోజు ప్రకటించిన ర్యాంకింగ్స్ లో దీపక్ చాహర్  బౌలింగ్ లో టాప్ యాభై స్థానాల్లోకి వచ్చేశాడు. ఇంతకుముందు మూడు డిజిట్ల  రూపంలో ఉన్న ర్యాంక్ ఒక్కసారిగా 88 స్థానాలు ఎగబాకి 42 వ స్థానానికి చేరుకున్నాడు. ఈ రేంజ్ లో బౌలింగ్ లో స్థానం మెరుగుపడటం ఇదే మొదటిసారేమో. బౌలింగ్ విభాగంలో మొదటి స్థానంలో అఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ ఉండగా,  ఆ తర్వాతి స్థానంలో న్యూజిలాండ్ కి చెందిన బౌలర్ మిచెల్ సాంత్నార్ కొనసాగుతున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: