పేటీఎం సిరీస్ సందర్బంగా బంగ్లాదేశ్‌ తో ఆదివారం ముగిసిన ఆఖరి టీ - 20 మ్యాచ్‌ లో 7 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ ఐసీసీ ప్రకటించిన టీ - 20 ర్యాంకింగ్స్‌ లో పైపైకి ఎగబాకాడు. టీమిండియా తరఫున టీ - 20 ల్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి ఆటగాడిగా అరుదైన ఘనత సాధించిన చాహర్, ర్యాంకింగ్స్‌ లో ఏకంగా 88 స్థానాలు పైకి ఎగబాకి బౌలర్ల జాబితాలో 42 వ స్థానం చేరుకున్నాడు.


మూడు టీ - 20 ల సిరీస్‌లో చెరొక హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ లో ఏకంగా టాప్ పది స్థానాలలో 7, 8 స్థానాల్లో నిలిచారు. ఈ ఇద్దరు మినహా భారత్ తరఫున ఎవరూ టాప్ - 10 లో చోటు దక్కించుకోలేకపోయారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ టీ - 20 సిరీస్‌ నుంచి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన అందరికి ఈ విషయం తెలిసిందే.


టీ - 20 ర్యాంకింగ్స్ బ్యాట్స్‌ మెన్ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 876 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, బౌలింగ్ ర్యాంకింగ్స్‌ లో అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఏకంగా 757 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలిచాడు. ఇక ఆల్‌ రౌండర్ జాబితాలోనూ అఫ్గానిస్థాన్‌ కే చెందిన మహ్మద్ నబీ 339 పాయింట్లతో టాప్‌ ప్లేస్ లో ఉండటం విశేషం. భారత్ తరుపున  టాప్ - 10 లో రోహిత్, రాహుల్ మినహా, ఏ బౌలర్, ఆల్‌రౌండర్ లేకపోవడం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది.


ఇక టీం రేటింగ్స్ లో భారత్ ఏకంగా ఐదో స్థానంలో ఉంది. ఈ లిస్ట్ లో ఆసియా దేశమైన పాకిస్థాన్ మొదటి స్థానంలో ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: