బంతి ఏదైనా, బౌలర్ ఎవరైనా రోహిత్ శర్మ సిక్స్ కొట్టగలడు. వీరేంద్ర సెహ్వాగ్ మాటల్లో చెప్పాలంటే మ్యాచ్‌ కి అనుగుణంగా టీ - 20 ల్లో గేర్ మార్చడంలో రోహిత్ శర్మ తర్వాతే ఎవరైనా.


మనందరికీ క్రికెట్ దేవుడు అనగానే అందరికీ గుర్తొచ్చేది సచిన్ టెండూల్కర్ మాత్రమే. మరి టీ - 20 క్రికెట్ దేవుడు ఎవరు..? అన్న ప్రశ్న కొంచెం వింతగానే ఉన్నా..! ప్రస్తుతం ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీనితో ఆ ప్రశ్నకి సమాధానం కోసం అభిమానులు గూగుల్‌ ని అడుగుతున్నారు. గూగుల్ దీనికి ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా..? ఒకే ఒక్క జవాబు రోహిత్ శర్మ.


ఇంగ్లాండ్‌ తో 2007 సంవత్సరంలో జరిగిన మ్యాచ్‌ తో అంతర్జాతీయ టీ - 20 ల్లోకి అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ఇప్పటి వరకూ 101 టీ - 20 మ్యాచ్‌ లు ఆడాడు. భారత్ తరఫున ఇన్ని అంతర్జాతీయ టీ - 20 లు ఎవరూ ఆడలేదు. ఇక బ్యాటింగ్ అవకాశం వచ్చిన 93 ఇన్నింగ్స్‌ ల్లో 32.14 సగటుతో 2,539 పరుగులు చేసిన రోహిత్ శర్మ టీ - 20 క్రికెట్‌ లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ గా కొనసాగుతున్నాడు. ఇందులో భాగంగానే 4 సెంచరీలు,18 అర్ధశతకాలు ఉండగా, తన కెరీర్‌లో ఇప్పటికే 225 ఫోర్లు, 115 సిక్సర్లని రోహిత్ తన ఖాతాలో బాదేశాడు. అంటే 1590 పరుగుల కేవలం ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే వచ్చాయి అంటే టీ - 20 ఫార్మెట్లో రోహిత్ ముద్ర ఎలా ఉందొ లో చించవచ్చు.


టీ - 20 ల్లో సుదీర్ఘకాలంగా రోహిత్ శర్మ జోరు ఇలా కొనసాగుతుంది కాబట్టే గూగుల్ కూడా అతడ్ని టీ - 20 క్రికెట్‌ కొత్త దేవుడిగా గుర్తించింది. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలోనే టీ - 20 ల్లో రోహిత్ శర్మ తరహా విధ్వంసక హిట్టర్ అనడం ఎటువంటి అతిశయోక్తి కాదేమో..!


మరింత సమాచారం తెలుసుకోండి: