బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ గెలిచి మంచి ఊపు మీద ఉంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అద్భుతంగా ఆడి అందరినీ ఆకట్టుకున్నారు.  ట్వంటీ ట్వంటీ సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న భారత జట్టు టెస్ట్ మ్యాచులకి సన్నద్ధం అవుతోంది. టెస్ట్ సిరీస్ లో కూడా అలాంటి ఉత్సాహాన్ని కనబరిచి సిరీస్ గెలవాలనుకుంటోంది. ఈ నెల పద్నాలుగవ తేదీన మొదటీ టెస్ట్ మ్యాచ్ ఇండోర్ లోని హాల్కర్ స్టేడియంలో జరగనుంది. 


ఈ నేపథ్యంలో భారత జట్టులోని ఆటగాళ్ళు ఎవరెవరుంటారనే చర్చ మొదలైంది. తుది జట్టులో ఆడడానికి మొత్తం పదకొండు మందిలో ఎవరెవరుంటారనేది చూసుకుంటే, ఈ సారి కెప్టెన్ గా కోహ్లీ ఆడే అవకాశం కనిపిస్తుంది. ట్వంటీ ట్వంటీ సిరీస్ కి ఆడని కోహ్లీ టెస్ట్ మ్యాచులకి ఆడే అవకాశం కనిపిస్తుంది. ఇక వైస్ కెప్టెన్ గా అజింక్యా రహానే కొనసాగనున్నాడు. అతనికి గాయం అయినా కుడా కుడిచేతి వాటం బ్యాట్స్ మెన్ అయిన రహానేని టీం లోకి తీసుకోకుండా ఉండలేరు. 


ఇక వికెట్ కీపర్ గా వృద్ధిమాన్ సాహా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అజింక్యా రహానే, వృద్ధిమాన్ సాహా, ఛతేశ్వర పుజారా లు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి దిగనున్నారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ దిగనున్నారు. రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇక ఆల్ రౌండర్ ల విషయానికి వస్తే, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రవీంద్ర జడేజా, రవిచంద్రన అశ్విన్ ఆడే అవకాశం ఉంది. వీరిద్దరు స్పిన్ బౌలర్లు కావడం విశేషం. 


ఇక సీమర్లలో ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ ఆడనున్నారు. మొత్తానికి ఈ సారి మంచి పటిష్టమైన ఆటగాళ్ళు ఆడుతున్నారని అర్థం అవుతుంది. మరి టెస్ట్ సిరీస్ లో కూడా ట్వంటీ ట్వంటీ లాగే సిరీస్ గెలుస్తారా లేదా చూడాలి. గురువారం నుండి మొదటి టెస్ట్ ప్రారంభమవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: