క్రికెట్ లో నో బాల్ వేస్తే, నో బాల్ కి ఒక పరుగు రావడంతో పాటు ఆ తర్వాత బంతి ఫ్రీ హిట్ గా వస్తుంది. అంటే ఆ బంతిని ఎలాగైనా కొట్టొచ్చు. క్యాచ్ పట్టినా, వికెట్లకి తాకినా ఔట్ కాదు. కాబట్టి బౌలర్లు నో బాల్ వేయకుండా చూసుకుంటారు. ఎందుకంటే కొన్ని సార్లు నో బాల్ వేయడం వల్లే మ్యాచ్ మలుపు తిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అందుకని బౌలర్లు నో బాల్ వేయకూడదనే అనుకుంటారు.


అయితే మంగళవారం జరిగిన ఆఫ్ఘాన్, విండీస్ మ్యాచ్‌లో.. నోబాల్ కాస్త డెడ్ బాల్‌గా మారింది. అది విండీస్ బౌలర్ పొలార్డ్ ప్రదర్శనతో.. ప్రస్తుతం అతడి ప్రదర్శనకు యావత్ క్రికెట్ ప్రపంచం పొగడ్తల వర్షం కురిపిస్తోంది. వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పోలార్డ్ గురించి అందరికీ తెలిసిందే. ఆల్ రౌండర్ అయిన పోలార్డ్ అటు బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడు. ఆఫ్ఘాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో పొలార్డ్ ఒక అద్భుతం చేశాడు. 


అతని బౌలింగ్ లో నో బాల్ అయ్యే బాల్ ని డెడ్ బాల్ గా మార్చి అందరి చేత వావ్ అనిపించుకున్నాడు. తాను బౌలింగ్ చేస్తున్నప్పుడు కాలు రెండవ లైన్ దాటి ముందుకి వెళ్ళిపోవడంతో అంపైర్ దాని నో బాల్ గా ప్రకటించాడు. అంపైర్ నో బాల్ అని చెప్పగానే ఠక్కున స్పందించిన పొలార్డ్ ఆ బంతిని తన చేతుల్లోంచి విసరలేదు. దాంతో ఆ బంతి కాస్తా డెడ్ బాల్ అయింది.  


నో బాల్ అవుతుందని తెలిసి ఇలా చేసినందుకు అందరూ అతన్ని పొగుడుతున్నారు. గేమ్ లో కాన్ సన్ ట్రేషన్ ఎంత ముఖ్యమో, అలాగే ప్రతిస్పందన కూడా అంతే ముఖ్యమని పొలార్డ్ ని చూస్తే తెలుస్తుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: