బంగ్లాదేశ్ తో జరిగిన టి ట్వంటీ మ్యాచ్ లో సిరీస్ కైవసం చేసుకున్న భారత్ టెస్ట్ మ్యాచ్ లకి సిద్ధం అవుతోంది. ఈనేపథ్యంలో  ఇరు జట్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే టీ ట్వంటీల్లో ఓడిపోయిన బంగ్లాదేశ్ టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన ప్రదర్శించడానికి సిద్ధమమవుతుండగా అనుకోని మార్పులు బంగ్లాదేశ్ ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.


ఇప్పటికే  బంగ్లాదేశ్ కెప్టెన అయిన షకీబ్ అల్ హాసన్  అంతర్జాతీయ క్రికెట్ నియమాల్ని ఉల్లంఘించాడన్న కారణంగా భారత్ టూర్ కి ముందే  కెప్టెన్సీ నుండి తొలగింపబడ్డాడు. అదే వాళ్లకి పెద్ద షాకింగ్ విషయమైతే ప్రస్తుతం మరో రెండు విషయాలు కూడా వారిని ఇబ్బంది పెడుతున్నాయి. భారత్ తో ఆడిన టి ట్వంటీ మ్యాచ్ లకి సారధిగా వ్యవహరించిన మహమ్మదుల్లా టెస్ట్ మ్యాచులకి దూరం కానున్నాడని సమాచారం. 


కొత్త కెప్టెన్ గా మోమిల్ హక్ బాధ్యత తీసుకోనున్నాడు. దీంతో బంగ్లాదేశ్ ఆటగాళ్ల పై ఒత్తిడి తీవ్రంగా పడనుంది. అంతే  కాదు  ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ,మరియు ఆల్ రౌండర్ అయిన మహమ్మద్ సఫియుద్దీన్ కూడా ఈ టెస్ట్ మ్యాచ్ కి దూరం అవుతున్నారు. తమిమ్  ఇక్బల్ తన భార్య ప్రెగ్నెంట్ అవడంతో ఈ మ్యాచ్ కి దూరమవుతుండగా సఫియుద్దీన్ వెన్నెముక గాయం కారణంగా మ్యాచ్  ఆడలేకపోతున్నాడు. 


ఇది ఒక రకంగా బంగ్లాదేశ్ కి కష్టతరమైన విషయమే .  దీనివల్ల టి ట్వంటీల్లో ఓడిపోయిన బంగ్లాదేశ్ టెస్ట్ ల్లో కూడా సరైన ప్రదర్శన ఇస్తుందో లేదో అన్న అనుమానం మొదలయింది .ఈ  విషయమై బంగ్లాదేశ్ అభిమానులు కలత చెందుతున్నారు. మరి కొత్త కెప్టెన్ తో టెస్టుల్లోకి దిగుతున్న బంగ్లాదేశ్ ఇండియాకి టఫ్ కాంపిటీషన్ ఇస్తుందా లేదా చుడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: