భారత క్రికెట్ టీంకి ఆడాలని చాలా మందికి ఉంటుంది. కానీ అవకాశం అందరికి రాదు. అవకాశం వచ్చినా తమని తాము నిరూపించుకోని వాళ్ళు కొందరుంటే, అవకాశం చూసే వాళ్ళు కొందరుంటారు. తమలో ప్రతిభ ఉండి అవకాశాలు లేక వెనకబడిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. అవకాశం ఇస్తే తమలోని ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేద్దామనుకునేవారికి అవకాశాలు రాక తమ ప్రతిభ బయటకి తెలియకుండా పోతుంది. 


ప్రతీ  రంగంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. భారత  క్రికెట్ లోకూడా ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఎన్నో రోజులుగా అవకాశం కోసం వేచి చూస్తున్న వాళ్ళు అవకాశం రాక బెంచీలకే పరిమితం అవుతున్నారు. అలాంటి ముగ్గురు క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా సంజూ సాంసన్ .ఈ  క్రికెటర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇరవై నాలుగేళ్ల  ఈ కుర్రాడు జట్టులో ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడడం కుదరక బెంచీకే పరిమితమవుతున్నాడు. 


కేరళ కి చెందిన సంజూ సాంసన్ దేశవాళీ క్రికెట్ లో  వికెట్ కీపర్ గా, బ్యాట్స్ మెన్ గా మంచి రికార్డు సాధించుకున్నాడు. గోవాతో జరిగిన దేశవాళీ మ్యాచ్ లో 129 బంతుల్లో 212 పరుగులు చేసిన ఈ  బ్యాట్స్ మెన్ ప్రస్తుతం అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. రిషబ్ పంత్ స్థానంలో సంజూ సాంసన్ ని తీసుకోవాలని ఒత్తిడి వస్తున్నా సెలెక్టర్లు ఇతన్ని పక్కన పెడుతున్నారు. ఇక రెండో వ్యక్తి రాహుల్ చాహర్ . లెగ్ స్పిన్నర్ అయిన రాహుల్ చాహర్ ఐపీఎల్ లోఅద్భుత ప్రదర్శన కనబరిచాడు.


 
అయినా కూడా బంగ్లాదేశ్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో బెంచికే  పరిమితమయ్యాడు.  ఇక మూడో వ్యక్తి శార్దుల్ ఠాకూర్. బంగ్లాదేశ్ తో జరిగిన మూడవ మ్యాచ్ లో ఖలీల్ మహమ్మద్ స్థానంలో శార్దుల్ ఠాకూర్ ని తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ టీం మేనేజ్ మెంట్ ఆ నిర్ణయాన్ని పక్కకి పెట్టింది. దీంతో శార్దుల్ కి అవకాశం రాకుండా పోయింది. ఈ విధంగా ముగ్గురు ఆటగాళ్లకి అటలో స్థానం రాకుండా పోయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: