ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్స్‌ దుమ్మురేపారు. వన్డేల్లో బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో టాప్‌ పొజీషన్‌ కైవసం చేసుకుని సత్తా చాటారు. బ్యాటింగ్‌లో రన్‌మెషీన్‌ కోహ్లీ నెం.1 ర్యాంక్‌ దక్కించుకోగా.. బౌలింగ్‌లో బుమ్రా టాప్‌ లేపాడు. సిక్సర్ల పిడుగు రోహిత్‌ మూడు ఫార్మాట్లలో టాప్‌ 10లో నిలిచి రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు.


ఐసీసీ వన్డే ర్యాంకులను విడుదల చేసింది. ప్రస్తుతం క్రికెట్‌ కౌన్సిల్‌ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో మనోళ్లు హవా చూపించారు. బ్యాటింగ్‌ విభాగంలో విరాట్‌ కోహ్లీ, బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రా నెం-1గా నిలిచారు. 895 పాయింట్లతో కోహ్లీ టాప్‌ ర్యాంక్‌లో ఉండగా.. 863 పాయింట్లతో హిట్‌మ్యాన్‌ సెకండ్‌ పొజిషన్‌లో ఉన్నాడు. గత కొద్ది కాలంగా.. వెన్ను నొప్పితో క్రికెట్‌కు దూరమైన పేస్‌ గుర్రం బుమ్రా తన ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. బౌలింగ్‌ విభాగంలో 797 పాయింట్లతో బుమ్రా టాప్‌ లేపాడు. అటు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ మూడు ఫార్మాట్లలో టాప్‌ -10లో చోటు దక్కించుకున్నాడు. ఇలా మూడు ఫార్మాట్‌లలో చోటు దక్కించుకున్న ఏకైక ఆటగాడిగా రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 863 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న రోహిత్, టెస్టుల్లో 722 పాయింట్లతో పదో స్థానంలో ఉన్నాడు. పొట్టి ఫార్మాట్‌ ఏడో స్థానంలో నిలిచాడు.   


బంగ్లాదేశ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత జట్టు.. తర్వాత ఆ జట్టుతో రెండు టెస్ట్‌ మ్యాచ్‌లలో తలపడనుంది. ఇందులో డే-నైట్‌ టెస్ట్‌ మ్యాస్‌ ఉంది. ఈ సిరీస్‌ తర్వాత డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ-20సిరీస్‌ ఆడనుంది. వెస్టిండీస్‌తో సిరీస్‌ వచ్చే నెల 6 నుంచి ప్రారంభం కానుంది.
>>



మరింత సమాచారం తెలుసుకోండి: