ప్రపంచ చాంపియన్ పీవీ సింధు మరో టైటిల్ సాధన దిశగా అడుగులు వేస్తోంది. హాంగ్ కాంగ్ ఓపెన్ లో స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ఈ టైటిల్ గెలిస్తే.. 4 లక్షల డాలర్ల విలువైన ప్రైజ్ మనీ వస్తుంది. ఈ టోర్నీలో ఆరో సీడ్ గా బరిలో దిగిన సింధు.. కొరియా క్రీడాకారిణి,ప్రపంచ 19వ ర్యాంకర్ కిమ్- గ- యూన్ ను మట్టికరిపించింది.


సింధు వరుస గేమ్ లలో 21-15, 21-16 తేడాతో కిమ్ -గ-యూన్ ను ఓడించింది. రెండో రౌండ్ లో థాయిలాండ్ షట్లర్ బుసానన్ ఓంగ్ బంగ్రున్ ఫాన్ తో పీవీ సింధు తలపడుతుంది. ఇదే సమయంలో పురుషుల సింగిల్స్ లో ప్రణయ్ చైనాకు చెందిన హ్యూంగ్ యూ జియాంగ్ పై 21-17, 21-17 తేడాతో గెలిచాడు రెండోరౌండ్ లోకి ప్రవేశించాడు.


ఇంత వరకూ బాగానే ఉన్నా.. సైనా నెహ్వాల్ , సమీర్ వర్మ వంటి వారు హాంగ్ కాంగ్ ఓపెన్ తొలి రౌండ్ లోనే ఇంటి ముఖం పట్టారు. భారత క్రీడాభిమానులను నిరాశపరిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: