భారత్‌తో ఇండోర్ వేదికగా గురువారం ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినుల్ హక్ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. ఇటీవల ముగిసిన మూడు టీ - 20ల సిరీస్‌ ని టీమిండియా 2-1 తో గెలవగా, కనీసం టెస్టుల్లో నైనా గట్టి పోటీ ఇవ్వాలని పసికూన ఆశిస్తోంది. అయితే, టెస్టు రికార్డుల్లో బంగ్లాదేశ్ పై ఇప్పటి వరకూ భారత్ జట్టు ఆధిపత్యం స్పష్టంగా కనపడుతోంది.

2000 సంవత్సరంలో టెస్టు హోదా పొందిన బంగ్లాదేశ్ ఈ 19 ఏళ్లలో టీమిండియాతో ఆరు సార్లు టెస్టుల్లో తలపడింది. కానీ, కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు ఈ క్రికెట్ పసి కూన. అందులో ఏకంగా ఐదింట్లో ఓడి, ఒక మ్యాచ్‌ని మాత్రం డ్రాగా ముగించుకుంది. చివరిగా 2017 సంవత్సరంలో హైదరాబాద్ లో జరిగిన టెస్టులో ఆ రెండు జట్లు ఏకైక టెస్టులో తలపడ్డాయి.


ఈ ఏడాది ఆగస్టులో టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలైన తర్వాత ఆడిన అన్ని టెస్టుల్లోనూ ఘన విజయాల్ని అందుకున్న టీమిండియా, ప్రస్తుతం మంచి జోరుమీద ఉంది అని చెప్పుకోవచ్చు. ఇటీవల వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు టెస్టుల్లో భారత్‌ కి కనీస పోటీని కూడా ఇవ్వలేక పోతున్నాయి. ఈ పరిస్థితులలో పసికూన బంగ్లాదేశ్ ఏ మేరకు భారత్ దూకుడు ముందు నిలబడుతూగో వేచి చూడాలి మరి. ఈ సిరీస్ లో మొత్తం మూడు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి.


ప్రస్తుతం ఈ టెస్ట్ పదకొండు ప్లేయర్ల జాబితా ఇలా ఉంది. మయాంక్  అగర్వాల్ , రోహిత్  శర్మ , చేటేశ్వర్  పుజారా , విరాట్ కోహ్లీ (c), అజింక్య రహానే, రవీంద్ర జడేజా, వర్ధమాన్ సహా(w), రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ.


మరింత సమాచారం తెలుసుకోండి: