ఐపీఎల్ వేలానికి సమయం దగ్గర పడుతోంది. సమయం దగ్గరవుతున్న కొద్దీ ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. మంచి మంచి ఆటగాళ్లని తమ జట్టులోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమ జట్టులోకి ఎవరిని తిసుకోవాలా అని ఆలోచిస్తున్నాయి. అదే క్రమంలో జట్టులో నుండి ఎవరిని బయటకి పంపాలా అని కూడా ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ జట్టు ముగ్గురు ఆటగాళ్ళని వదిలించుకోవాలని అనుకుంటుంది. మొదటగా షకిబ్ అల్ హసన్. బంగ్లాదేశ్ ఆటగాడయిన షకిబ్ ని గత సీజన్ లో రెండు కోట్లు పెట్టి సన్ రైజర్స్ దక్కించుకుంది. 


ఆ సీజన్ లో షకిబ్ కేవలం మూడు మ్యాచులు మాత్రమే ఆడాడు. ఓవర్సీస్ ఆటగాళ్ళు ఎక్కువ మంది అవడంతో అతన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. అదీగాక ఐసీసీ నిబంధనల ప్రకారం ౨౦౨౦ అక్టోబరు వరకు ఆడడానికి వీలు లేదు. దాంతో మరో కొత్త ప్లేయర్ ని వెతుక్కునే పనిలో పడింది. ఇక రెండో ఆటగాడు అభిషేక్ శర్మ. ఈ ఆటగాడు గత సీజన్ లో మూడు మ్యాచు;ఉ ఆడినప్పటికీ తనదైన మార్క్ ని చూపించలేకపోయాడు. 


అదీ గాక ఇతని కంటే మంచి ఆల్ రౌండర్స్ ఉండడంతో పక్కన పెట్టాల్సి వచ్చింది. అందుకని ఈ సంవత్సరం అభిషేక్ ని వదులుకునే అవకాశం ఉంది. ఇక మూడో ఆటగాడు శ్రీ వాత్సవ గోస్వామి. గత సీజన్ లో కోటి రూపాయలు చెల్లించి ఈ ఆటగాడిని జట్టులోకి తీసుకుంది. వికెట్ కీపర్ అయిన గోస్వామి బాగానే ఆడుతున్నప్పటికీ,  బైర్ స్ట్రో వచ్చేసరికి ఇతన్ని బంచీకే పరిమితం చేయాల్సి వచ్చింది. దాంతో ఈ సంవత్సరం గోస్వామి వదిలించుకోవాలని చూస్తుంది. మొత్తానికి ఈ ముగ్గురు క్రికెటర్లని సన్ రైజర్స్ వదులుకోవాలని చూస్తుంది. మరి వీరి స్థానంలో ఎవరు వస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: