ఐపీఎల్ వేలానికి మరికిద్ది రోజులు సమయం ఉండడంతో ఫ్రాంఛైజీలు ఆటగాళ్ళని మార్చుకోదల్చారు. దీన్ని ట్రేడింగ్ అంటారు. ఈ రోజుతో ఐపీఎల్ ట్రేడింగ్ ముగియనుంది. ఈ ట్రేడింగ్ ప్రకారం ఫ్రాంచైజీలు తమ జట్తులోని ఆటగాళ్లను వేరే జట్టు ఆటగాళ్లతో మార్చుకోవచ్చు. ఇరు ఫ్రాంఛైజీల ఒప్పందం ప్రకారం ఆటగాళ్ళు మారుతుంటారు. ఈ ట్రేడింగ్ ప్రక్రియ 2015 నుండి మొదలయింది. అయితే ఈ సారి ట్రేడింగ్ ద్వారా ట్రెంట్ బౌల్ట్ ముంబయి ఇండియన్స్ కి మారాడు.


ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్‌ తన అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్‌ ట్రేడింగ్‌ విండో ద్వారా ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్ లో మొదటి సారిగా సన్ రైజర్స్ తరపున ఆడిన ఈ బౌలర్ ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఆడాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఇప్పటివరకు మూడు ఫ్రాంచైజీల తరుపున బౌల్ట్‌ ఆడాడు. అయితే వచ్చే సీజన్‌ కోసం సక్సెస్‌ఫుల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌తో ట్రెంట్‌ బౌల్ట్‌ జతకట్టాడు. దీంతో ముంబయి ఇండియన్స్ కి మరింత బలం పెరగనుంది.

ఐపీల్ లో ఫేవరేట్ అయిన ముంబయి ఇండియన్స్ ఈ సారి మరింత గట్టిగా పోటీ ఇవ్వబోతుందని తెలుస్తుంది. ఇక మరో ఆటగాడు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరపున ఆడిన అంకిత్‌ రాజ్‌పుత్‌ ట్రేడింగ్ లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌కు బదిలీ అయ్యాడు. అంకిత్ పంజాబ్ తరపున ఎన్నో మంచి ఇన్నింగ్సులు ఆడిన విషయం తెలిసిందే. ఈ ట్రేడింగ్ విధానంలో భాగంగానే పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్స్ కి మారాడు. ఈ ట్రేడింగ్ విధానం ఈరోజుతో ముగియనుంది. ఇదిలా ఉంచితే డిసెంబర్ 19 న ఐపీఎల్ వేలం కోల్ కతాలో జరగనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: