బంగ్లాదేశ్ తో జరిగిన మూడవ టీ ట్వంటీలో ఆరు వికెట్లు పడగొట్టడమే కాకుండా హ్యాట్రిక్ సాధించిన భారత బౌలర్ దీపక్ చాహర్. కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టడం రికార్డు. అయితే ఈ రికార్డు సాధించిన మరో రెండు రోజుల్లో దేశవాళీ క్రికెట్ లోనూ హ్యాట్రిక్ సాధించాడు. మూడు రోజుల వ్యవధిలోనే రెండు హ్యాట్రిక్ లు సాధించడం అతనికే సొంతం. అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్ లో హ్యాట్రిక్ సాధించిన మొదటి పురుష ఆటగాడు దీపక్ చాహర్.  


ఐపీఎల్ లో చెన్నై తరపున ఆడే దీపక్ చాహర్ తన బౌలింగ్ గురించి ఇలా చెప్పుకొచ్చాడు. నేను చెన్నైకి ఆడుతున్నప్పుడు ధోనీ నాకెన్నో సలహాలు ఇచ్చేవాడు. బ్యాట్స్ మెన్ బాడీ మూమెంట్ ని అర్థం చేసుకుని బౌలింగ్ చేయడం అక్కడే నేర్చుకున్నాను. అంతే కాదు మ్యాచ్ కి ముందు అవతలి జట్టు బ్యాట్స్ మెన్ వీడియోలు చూస్తాను. దానివల్ల నాకెంతో ఉపయోగపడుతుంది. 


బంతిని రెండు వైపుల స్వింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఈ ఆటగాడు ధోనీ గురించి చాలా చెప్పుకొచ్చాడు. బౌలింగ్ లో అతడు ఒత్తిడికి గురైనపుడు ధోనీ గుర్తు తెచ్చుకుంటాడట. చెన్నైకి ఆడినపుడు ధోనీ ఇచ్చే సలహాలు చాలా హెల్ప్ చేసేవని చెప్తున్నాడు. రెండేళ్ళకు పైగా ధోనీ నాయకత్వంలో చెన్నైకి ఆడడంతో మైదానంలో గానీ, బయటగానీ ధోనీ సలహాలు ఇచ్చేవాడట. ఆ సలహాలు అతనికి ఎంతో మేలు చేసేవని చెప్తున్నాడు.  వికెట్ల వెనకాల ఉండే మహీభాయ్ బ్యాట్స్ మెన్ కదలికల్ని గమనించి బౌలర్ కి సలహాలు ఇస్తాడట. దానితో బౌలర్ కి బంతిని ఎలా వెయ్యాలో సులభంగా అర్థం అయ్యేది. అప్పుడు వికెట్లు పడేవి అని ధోనీ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: