విరాట్ కోహ్లీ టీం ఇండియా కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాక కుర్రాళ్ళు బాగా రాణిస్తున్నారు.  విరాక్ దూకుడుగా వాడుతుండటం అందుకు ఒక కారణం.  విరాట్ తో పాటు టీం ఇండియాలోని ఆటగాళ్లను సైతం ప్రోత్సహిస్తున్నాడు.  ప్రస్తుతం ఇండియా.. బాంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ సీరీస్ జరుగుతున్నది.  ఫస్ట్ టెస్ట్ లో బంగ్లాదేశ్ 160 పరుగులకే చేతులు ఎత్తేసింది.  అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇండియా జట్టు మొదటిరోజు అట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది.  


ఇదిలా ఉంటె కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇది 83 వ టెస్ట్ మ్యాచ్.  ఇప్పటి వరకు టెస్టుల్లో 7, 066 పరుగులు చేశారు.  మరో 147 పరుగులు చేస్తే ఇండియన్ మాజీ కెప్టెన్ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు.  గంగూలీ టెస్టుల్లో 7,212 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.  ఈ రికార్డును బ్రేక్ చేస్తే ఇండియాలో టెస్టుల్లో అత్యధిక స్కోర్ చేసిన ఆరో ఆటగాడిగా కోహ్లీ పేరు చేరుతుంది. కోహ్లీ కంటే ముందు ఉన్న ఆటగాళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం. 


సచిన్ 15, 921 పరుగుతులో టాప్ లో ఉండగా, ద్రావిడ్ 13, 288 పరుగులతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.  సునీల్ గవాస్కర్ 10,122తో మూడో స్థానంలో ఉండగా, లక్ష్మణ్ 8, 718తో నాలుగో స్థానంలోనూ, సెహ్వాగ్ 8,250 పరుగుట్లతో ఐదో స్థానంలోను ఉన్నారు.  ఆరోస్థానంలో గంగూలీ ఉన్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు గంగూలీ రికార్డును బ్రేక్ చేసే దిశగా కోహ్లీ అడుగులు వేస్తున్నాడు.  


ఒక్క గంగూలీ రికార్డునే కాదు, గేల్ 7,214, ఫ్లెమింగ్ 7,172, గ్రెగ్ చాపెల్ 7110 రికార్డును కూడా కోహ్లీ అధికమించబోతున్నాడు.  కోహ్లీ దూకుడు చూసుంటే టెస్టుల్లో ఖచ్చితంగా సెకండ్ ప్లేస్ లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.  అది మరెంతో దూరంలో ఉండకపోవచ్చు.  కోహ్లీ రిటైర్ అయ్యేలోపు ఖచ్చితంగా ద్రావిడ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది.  మరి చూద్దాం ఏమౌతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: