ఇండోర్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతికే డకౌట్ గా వెనుదిరిగాడు. అబు జయేద్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. మరోవైపు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


ఈరోజు ఒక వికెట్ నష్టానికి 86 పరుగులతో ఆటను ప్రారంభించిన భారత్ కు కాసేపట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. 43 పరుగులతో క్రీజులోకి వచ్చిన పుజరా 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అబు జయేద్ బౌలింగ్ లో సబ్ స్టిట్యూట్ సైఫ్ హసన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిగిగాడు. ఆ తర్వాత కోహ్లీ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ 63 పరుగులు, రహానే 21 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారత్ ప్రస్తుత స్కోరు మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు. ఈ మూడు వికెట్లను జయేద్ పడగొట్టడం గమనార్హం. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు (150) కంటే భారత్ 4 పరుగుల వెనుకబడి ఉంది.


ఇక ఇన్నింగ్స్ 32వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ అబు జాయెద్ బౌలింగ్‌లో బంతిని విరాట్ కోహ్లీ ముందుకు ఫుష్ చేసేందుకు ప్రయత్నం చేశాడు. కానీ.. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతి అనూహ్యంగా లోపలికి దూసుకు రావడం జరిగింది. దీంతో అతని బ్యాట్‌కి అందని బంతి నేరుగా వెళ్లి ఫ్యాడ్స్‌ని  తాకడం జరిగింది. వెంటనే కోహ్లీ ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం బంగ్లాదేశ్ ఫీల్డర్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించడం జరిగింది. కానీ.. కీపర్ లిట్టన్ దాస్‌తో మాట్లాడిన కెప్టెన్ మొమినుల్ హక్.. డీఆర్‌ఎస్ కోరడం జరిగింది.


ఇది మూడోసారి సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో విరాట్ కోహ్లీ భారత్ గడ్డపై డకౌటవడం. 2017లో ఆస్ట్రేలియాతో పుణె వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌటైన కోహ్లీ.. ఆ తర్వాత 2018లో కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టులో సురంగ లక్ష్మల్ బౌలింగ్‌లో జీరోకే డకౌటవడం అవడం జరిగింది. మొత్తంగా విరాట్ కోహ్లీ.. ఒకే ఏడాదిలో మాత్రం రెండు సార్లు డకౌటవడం ఇదే తొలిసారి అవ్వడం గమనార్థకం.



మరింత సమాచారం తెలుసుకోండి: