క్రీడా దిగ్గజాలు యువరాజ్ సింగ్ మరియు సానియా మీర్జా మంచి స్నేహితులు మరియు ఒకరికొకరు సోషల్ మీడియా లో పరస్పరం జోకులు వేసుకుంటూ వుంటారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పుట్టినరోజు సందర్భంగా ట్విటర్‌ వేదికగా ‘హాయ్‌ మిర్చీ’ అంటూ శుభాకాంక్షలు చెప్పాడు.


"హాయ్‌ మిర్చీ.. నా ప్రియనేస్తానికి పుట్టినరోజు.. శుభాకాంక్షలు" అని యువి తన ట్విట్టర్ అకౌంట్ లో సానియా మీర్జా కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇక సానియా మీర్జా ఈ ట్వీట్ కు అంతే రీతిన రిప్లై ఇచ్చింది. ఇక క్షణాల్లోనే సానియా యువి చేసిన కామెంట్ కు రిప్లై ఇచ్చింది "హాయ్‌ మోటూ. థాంక్యూ" అని తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసింది. ఇక యువీ, సానియా ఫ్రెండ్స్‌ అవటం చేత సరదా కామెంట్లు చేసుకుంటారనేది తెలిసిందే.


ఇక ఇదే తరహా సందర్బం కొన్ని రోజుల క్రితం జరిగింది,  కొన్ని రోజుల క్రితం నున్నటి గడ్డంతో కనిపించిన యువీ.. ‘నున్నటి గడ్డంతో బాగున్నానా.. మళ్లీ పెంచనా’అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేయగా.. ‘నున్నటి గడ్డం మాటున ఏం దాగుందో.. గడ్డం పెంచాల్సిందే’అంటూ సానియా రిప్లై ఇచ్చారు. 


వీరు చేసుకున్న కామెంట్స్ ఇక నెట్టింట్లో వైరల్ గా మారాయి. సరదాగా చేసుకున్న కామెంట్స్ పై నెటిజెన్స్ కూడా తమదైన రీతిలో సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. సానియా మీర్జా పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్నారు. ఇక యువరాజ్ సింగ్ ఇటీవలే అంతర్జాతీయా క్రికెట్‌కు, ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. బీసీసీఐ అనుమతితో అతను విదేశీ లీగుల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇక సానియా కూడా టెన్నిస్ ఆట తో బిజీ గా వున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: