ఇండోర్ వేదికగా హోల్కర్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి ౪౯౩ పరుగులు చేయగలింది. రెండో రోజు ఆటలో  బ్యాట్స్ మెన్స్ దుమ్ము లేపారనే చెప్పాలి. మొదటి రోజు బౌలర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరచగా, రెండోరోజు బ్యాట్స్ మెన్స్ బ్యాటింగ్ తో ఇరగ దీశారు. మన బ్యాట్స్ మెన్ ధాటికి స్కోరు బోర్డ్ విపరీతంగా పరుగులు పెట్టింది. ఓపెనర్ గా వచ్చిన మయాంక్ అగర్వాల్ డబల్ సెంచరీ చేసాడు. అయితే ఒక దశలో మయాంక్ అగర్వాల్ వరుస సిక్సర్లతో స్టేడియంలోని ప్రేక్షకులకి టీ ట్వంటీ మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించాడు. 


అయితే మయాంక్ అలా ఆడడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మయాంక్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకి వచ్చి మయాంక్ అగర్వాల్ కి ఒక సైగ చేశాడు. దాని ప్రకారం మెల్లగా ఆడకుండా సిక్సర్లు కొట్టేలా ఆడాలని, తన చేతులతో చూపిస్తూ సైగ చేశాడు.   ఈ రోజుతోనే మ్యాచ్ ని ముగించేయాలని చెప్పినట్టు అర్థం వచ్చేలా అతని సైగలు ఉన్నాయి. రోహిత్ ఆ సైగ చేసిన తర్వాత స్టేడియం మొత్తం సిక్సర్ల మోత మోగింది. 


రవీంద్ర జడేజా, మయాంక్ అగర్వాల్ లు కలిసి బంగ్లా బౌలర్లకి ముచ్చెమటలు పట్టించారు. వరుస సిక్సర్లు, ఫోర్లతో కేవల  32 బంతుల్లో 56 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. మయాంక్ అగర్వాల్ తీవ్రంగా విరుచుకుపడి  8సిక్సర్లు, 28 ఫోర్లతో కలిపి 243 పరుగులు చేశాడు. ఒక దశలో బంగ్లా బౌలర్లు బౌలింగ్ చేయడానికి తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆ తర్వాత తొమ్మిదవ సిక్సర్ కి ప్రయత్నించగా ఔటయ్యాడు. దీంతో మయాంక్ అగర్వాల్ ట్రిపుల్ సెంచరీ మిస్ అయ్యాడు. మొత్తానికి టెస్ట్ మ్యాచ్ లో కొద్దిసేపు టీ ట్వంటీ మ్యాచ్ ని గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: