బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 493 పరుగులు చేయగలిగింది. మొదటిరోజు ౧౫౦ పరుగులకే ఆలౌట్ అయిన బంగ్లాదేశ్, రెండవ రోజు బౌలింగ్ లోనూ  అదే పేలవ ప్రదర్శనని కనబరిచింది. భారత బ్యాట్స్ మెన్ బంగ్లా బౌలర్లని ఉతికి పారేశారనే చెప్పాలి. బంగ్లా బౌలర్ల మీద భారత బ్యాట్స్ మెన్ విధ్వంసం సృష్టించారు. 


ఆ విధ్వంసంలో భాగంగానే మయాంక్ అగర్వాల్ డబల్ సెంచరీ చేశాడు. అయితే మయాంక్ అగర్వాల్ కు ఇది రెండవ డబల్ సెంచరీ మొన్నటికి మొన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఒక డబల్ సెంచరి చేశాడు. ఆ డబల్ సెంచరీ చేసి కొన్ని రోజులు కూడా పూర్తి కాకుండానే మరో డబల్ సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన బ్యాటింగ్ విశ్వరూపంతో బంగ్లాదేశ్ బౌలర్లకి చెమటలు పట్టించాడు.

మయాంక్ అగర్వాల్ చేసిన డబల్ సెంచరీతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. అయితే మయాంక్ అగర్వాల్ మరో రికార్డుకి చేరువలో ఉన్నాడు. ఇప్పటి వరకు ఎనిమిది టెస్ట్ మ్యాచులాడిన మయాంక్ పన్నెండు ఇన్నింగ్సుల్లో 858 పరుగులు చేశారు.


మయాంక్ ఇలానే ఆడితే బ్రాడ్ మన్ రికార్డు ను బద్దలు కొట్టిన వాడవుతాడు. పదిహేను మ్యాచులాడిన బ్రాడ్ మాన్ ఇరవై రెండు ఇన్నింగ్సులాడి రెండువేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దాంతో అతి తక్కువ మ్యాచుల్లో రెండు వేల పరుగులు చేసినవాడిగా బ్రాడ్ మాన్ గుర్తింపు సాధించాడు. ఈ రికార్డుకి కొద్ది దూరంలో మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. అతని ఆట ఇలానే కొనసాగితే ఆ రికార్డుని అందుకోవడం ఏమంత కష్టం కాదని తెలుస్తుంది. మరి మయాంక్ ఆ రికార్డుని అందుకుని ఎన్నో ఏళ్ళుగా అలాగే ఉన్న రికార్డుపై తన పేరు లిఖించుకుంటాడా లేదా చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: