టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... పరుగుల యంత్రం... రికార్డుల రారాజు... ఇలా చెప్పుకుంటూ పోతే కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశంలోనే అత్యుత్తమ  ఆటగాళ్లలో మొదటి స్థానంలో ఉంటాడు. టీమ్  ఇండియా కెప్టెన్ గా  జట్టుకు  ఎన్నో విజయాలను అందించిన ధీరుడు  కోహ్లీ . కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ కీ  ఫిదా అవ్వని క్రికెట్  ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఒక్కసారి బ్యాట్  పట్టాడంటే  పరుగు పరుగుల వరద పారాల్సిందే... ఒకసారి మైదానంలోకి వస్తే రికార్డులు బద్దలు కొట్టాల్సిందే . కోహ్లీ తీరు ఇలాగే ఉంటుంది. కోహ్లీ ప్రతి విషయంలో మిగతా ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తుంటాడు . ఒక కెప్టెన్ గా ఒక గొప్ప బ్యాట్స్ మెన్ గానే కాదు... ఫిట్ నెస్  విషయంలోనూ  ఎంతో మందికి కోహ్లీ ఇన్స్పిరేషన్ గా ఉంటాడు. ఇక విరాట్ కోహ్లీ ఫిట్నెస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో  కూడా అందరికీ తెలిసిన విషయమే. 

 

 

 

 ఇక కోహ్లీ రికార్డుల గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ. ఎంతోమంది క్రికెట్ దిగ్గజాలు సాధించిన రికార్డును సైతం అలవోకగా తక్కువ సమయంలో తిరగ రాశాడు విరాట్ కోహ్లీ. మరిన్నో రికార్డులు బద్దలు కొట్టడానికి చేరువలో ఉన్నాడు. అందుకే విరాట్ కోహ్లీని రికార్డుల రారాజుగా పిలుస్తుంటారు. మైదానంలో అడుగుపెట్టాక అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా విరాట్ కోహ్లీ సొంతం. అయితే ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ తాజాగా మరో కొత్త రికార్డు సృష్టించాడు. 

 

 

 

 ఇండోర్ లో  బంగ్లాదేశ్ తో  జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో  130 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఇన్నింగ్స్ ఘన విజయం సాధించింది. అయితే ఈ గెలుపుతో  విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక ఇన్నింగ్స్ విజయాలను అందుకున్న భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. అయితే ఇంతకుముందు మాజీ కెప్టెన్ ధోనీ తొమ్మిది ఇన్నింగ్స్ విజయాలతో   తొలి స్థానంలో ఉండగా... తాజాగా 10 విజయాలతో  ధోని ని వెన్నక్కి కోహ్లీ మొదటి స్థానం లోకి వచ్చేసాడు. ఇక ఆ తర్వాత 8 విజయాలతో అజారుద్దిన్, 7  విజయలతో గంగూలీ  ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: