ఈమధ్య అభిమానులు  మైదానంలోకి దూసుకు వచ్చి తమ తమ అభిమాన క్రికెటర్ లను కలుస్తుండటం   కామన్ అయిపోయింది.ఏ మ్యాచ్ లో  చూసిన ఇలాంటి సంఘటన ఒకటి జరుగుతుంది. ఇక అభిమానులు కూడా ఇలా మైదానంలోకి దూసుకు వచ్చి తన అభిమాన క్రికెటర్లను కలవడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఇది అభిమానులకు బాగానే ఉన్నప్పటికీ అక్కడ ఉన్న సిబ్బంది మాత్రం పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎదురయింది. అయితే విరాట్ కోహ్లికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలుసిందే.  ఒక్క ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా విరాట్ కోహ్లీ అంటే పడిచచ్చే అభిమానులు ఎంతో మంది. 



 అటు దాయాది దేశమైన పాకిస్థాన్లో కూడా విరాట్ కోహ్లీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీ తన అభిమానుల కోసం ఎప్పుడూ నిరాశ పరచకుండా వాళ్లకి తనకు డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. ఒక క్రికెట్ కి సంబంధించింది కాకుండా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన అప్డేట్స్ ని  కూడా అభిమానులతో పంచుకుంటారు  విరాట్ కోహ్లీ. అయితే మధ్యప్రదేశ్ ఇండోర్లో ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన  టెస్ట్ మ్యాచ్ మూడో రోజున ఓ వీరాభిమాని డ్రింక్స్ బ్రేక్స్ సమయంలో  మైదానంలోకి దుసుకొచ్చాడు. పరుగులు పెడుతూ విరాట్ కోహ్లీ దగ్గరికి చేరుకున్నారు. అతని వీపుపై వీకే అని  రాసుకున్న అభిమాని విరాట్ కోహ్లీ జెర్సీ  నెంబర్ 18 కూడా పెయింట్ వేసుకున్నాడు. 



 ఇక మైదానంలోకి దూసుకెళ్లిన ఆ వీరాభిమాని విరాట్ కోహ్లీ  కాళ్లు పట్టుకునేందుకు  ప్రయత్నించాడు. ఇంతలో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ వీరాభిమానిని పట్టుకునేందుకు వచ్చారు. అయితే వాళ్లను చూస్తే రెండు తగిలించేలా  కనిపించడంతో విరాట్ కోహ్లీ తన అభిమాన ఏమి చేయొద్దంటూ వారి నుండి రక్షించి బయటకు పంపించేశారు. దీంతో తమ అభిమాన క్రికెటర్ సిబ్బంది  దగ్గరుండి తనను రక్షించటమే  కాదు తన బుజం పైన  చేయి వేసి మాట్లాడడంతో వీరాభిమాని ఫుల్ ఖుషి అయిపోయాడు. ఇక సిరీస్  విషయానికొస్తే టీమ్ ఇండియా ఓ ఇన్నింగ్స్  గెలవడంతో 1-0 ఆధిక్యంలో ఉంది. టీమిండియా దూకుడుకి మూడు రోజులకే మ్యాచ్ ముగిసిపోయిం.ది రెండో మ్యాచ్ కలకత్తాలో ఈ నెల 22న ఈడెన్  గార్డెన్స్ లో జరగనున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: