శ్రీలంక బౌలర్లు ఎవరని అడగ్గానే టక్కున గుర్తొచ్చే పేరు మలింగ.తన యార్కర్ లతో బ్యాట్స్ మెన్ కి ముచ్చెమటలు పట్టించే బౌలర్ మలింగ. తన బౌలింగ్ మాయాజాలంతో శ్రీలంక క్రికెట్ కి ఎంతో సేవలందించాడు. శ్రీలంక టీ ట్వంటీ మ్యాచులకి సారథ్యం వహించిన మలింగ తన రిటైర్ మెంట్ గురించి గతంలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే ఆ సేవల్ని ఆపేస్తానని తన క్రికెట్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నానని గతంలో చెప్పాడు. 

 

36 ఏళ్ళ మలింగ ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్ టీ ట్వంటీ ప్రపంచకప్ తర్వాత  వీడ్కోలు పలకాలని అనుకున్నాడు. కానీ సడెన్ గా మలింగ యూటర్న్ తీసుకున్నాడు. ఆ నిర్ణయంపై మళ్ళీ ఆలోచిస్తున్నానని తెలిపాడు. టీ ట్వంటీలో నాలుగు ఓవర్లే కావడంతో మరో రెండు ఓవర్లు తాను బౌలింగ్ చేయగలనని చెప్పుకొచ్చాడు. వీడ్కోలు విషయమై మాట్లాడుతూ, ఇప్పటి వరకు నేనెన్నో టీ ట్వంటీ మాచులు ఆడాను. 

 

ఇక ముందు కూడా ఆడాలని అనుకుంటున్నాను. నా బౌలింగ్ నైపుణ్యంతో నాలుగు ఓవర్లు వేయగలనని అనుకుంటున్నాను. మరో రెండేళ్ళ వరకు రిటైర్ మెంట్ గురించి ఆలోచించాలని అనుకోవట్లేదు. ఇప్పటి వరకు ఎలా ఆడానో మరో రెండేళ్ళు కూడా అలాగే ఆడతాను అని అన్నాడు. టీ ట్వంటీ వంద వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా చరిత్ర సృష్టించిన మలింగ తన రిటైర్ మెంట్ పై యూటర్న్ తీసుకోవడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించినా, చాలామంది తన నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

అయితే మలింగ ఇంతకు ముందు శ్రీలంక టీ ట్వంటీ  టీమ్ సారధిగా వ్యవహరించాడు.  మరి ఇకముందు కూడా కెప్టెన్ గా కొనసాగుతారా లేదా అనేది స్పష్టం కావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: