ఐపీఎల్ వేలంలో ఆటగాళ్ల ప్రదర్శనకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఎంత గొప్ప ఆటగాళ్ళయిన ప్రస్తుతం ఫామ్ లో లేకపోతే పక్కన పెట్టేస్తారు. ఎంతో గొప్ప ఆటగాళ్ళుగా పేరు తెచ్చుకుని ఈ సీజన్ వేలంలో పక్కకు తప్పుకునే ఆరుగురు ఆటగాళ్ళెవరో చూద్దాం. మొదటగా డేల్ స్టెయిన్. దక్షిణాఫ్రికా ఆటగాడయిన స్టెయిన్ గత కొన్ని సీజన్ల వారిగా  సరైన ఫామ్ లో లేడు.  గత సీజన్ లో రాయన్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన స్టెయిన్ ఫిట్ నెస్ సమస్యల వల్ల సరైన ప్రదర్శన కనబరచలేదు. 

 

 

ముఫ్పై ఆరేళ్ల స్టెయిన్ వయసు రీత్యా పొట్టి క్రికెట్ కి దూరం అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మరో ఆటగాడు న్యూజిలాండ్ కి చెందిన మార్టిన్ గుప్తిల్. న్యూజిలాండ్ తరపున ఆడే టీ ట్వంటీ మ్యాచుల్లో అద్భుత ఆటను కనబరిచే గుప్తిల్ ఐపీఎల్ అలాంటి ఆటతీరును కనబర్చట్లేదు. దాంతో ఫ్రాంచైజీలు ఇతన్ని పక్కన పెట్టేస్తున్నారు. మూడవ ఆటగాడు డేవిడ్ మిల్లర్. ఎడమ చేతి వాటం ఆటగాడయిన మిల్లర్ అంతర్జాతీయ పొట్టి క్రికెట్ లో 35 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. కానీ అతని ఆటని ఐపీఎల్ లో మాత్రం చూపించలేకపోతున్నాడు. 

 

గత నాలుగు సీజన్ల నుండి గమనిస్తే మిల్లర్ చెప్పుకోదగ్గ ఆట ఆడలేదు. నాలుగవ ఆటగాడు టిమ్ సౌథీ. ఇటీవల బెంగళూరు ఈ ఆటగాన్ని వదులుకుంది. ఇప్పటి వరకు నలభై ఐపీఎల్ మ్యాచులాడిన సౌథీ ఇరవై ఎనిమిది వికెట్లు మాత్రమే తీశాడు. అదీ గాక డెత్ ఓవర్లలో విపరీతంగా పరుగులు ఇస్తాడనే పేరు కూడా ఉంది. ఐదవ ఆటగాడు యూసప్ పఠాన్... గత ఐపీఎల్ లో పేలవ ప్రదర్శనతో నిరాశపర్చడంతో పఠాన్ ని పక్కన పెట్టేస్తున్నారు.

 

 

ముఖ్యంగా ముఫ్పై ఏడేళ్ల వయసు అతన్ని ఐపీఎల్ కి దూరం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక చివరగా విండీస్ కి చెందిన కార్లోస్ బ్రాత్ వైట్. 2016 టీ ట్వంటీ ప్రపంచకప్ లో హీరోగా నిలిచిన బ్రాత్ వైట్ ఐపీల్ లో సరైన ప్రదర్శన కనబర్చట్లేదు. ఆల్ రౌండర్ అయిన బ్రాత్ వైట్ పదహారు మ్యాచులాడి 181 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ లోనూ అతని ప్రదర్శన చెప్పుకోదగినదిగా లేదు. ఈ సీజన్ లో బ్రాత్ వైట్ ని తీసుకునే అవకాశాలు చాలా తక్కువ. మొత్తానికి ఈ ఆరుగురు ఆటగాళ్ళు ఈ సీజన్ లో కనిపించకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: