విరాట్ కోహ్లీ...భారత క్రికెట్ టీమ్ సారథిగా తనదైన శైలిలో దూసుకుపోతున్న బ్యాట్స్ మెన్. పరుగుల వరద పారిస్తూ సచిన్ సెంచరీల రికార్డుకు చేరువ అవుతున్న ఆటగాడు. తన సొగసైన బ్యాటింగ్ తో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్న ఆటగాడు. సచిన్ తర్వాత మళ్ళీ అంతటి బ్యాటింగ్ పటిమతో ముందుకు దూసుకుపోతున్నాడు. క్రికెట్ లోని మూడు ఫార్మాట్ లలో సగటు యాభైతో అందరి కంటే ముందున్నాడు. 

 

ఇలా కోహ్లీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఈ మాటలు మనకి తెలిసినవే అయినా ఒక ప్రముఖ క్రికెట్ ఆటగాడి నుండి రావడం విశేషం.  వెస్టిండీస్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ కోహ్లీ గురించి చాలా మాట్లాడాడు.  పొట్టి క్రికెట్ లో రస్సెల్ ఎలా ఆడతాడో అందరికీ తెలిసిందే. గత  ఐపీఎల్ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన రస్సెల్ ఓడిఫోయే మ్యాచులను సైతం తన సూపర్ పర్ ఫార్మెన్స్ తో గెలిపించిన విషయం తెలిసిందే.

 

ఈ ఆల్ రౌండర్ ఆటగాడు ఒకానొక ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి ఈ విధంగా మాట్లాడాడు. కోహ్లీ బ్యాటింగ్ లో ఒక సొగసు ఉంటుంది. అలాగే ఆయన మంచి టెక్నిక్ తో ఆడతాడు. నా బ్యాటింగ్ స్టైల్ అలా ఉండదు. నా ఎదురొచ్చిన ప్రతీ బంతిని బలం ప్రయోగించి ఆడడానికే ప్రయత్నిస్తాను. కానీ కోహ్లీ అలా కాదు. అతను ఒక ట్రూ ఛాంపియన్. ఆల్ రాండ్ ఆటగాడు. అన్ని ఫార్మాట్లలోనూ తన ఆటను ఒకేలా కొనసాగిస్తున్నాడు.  

 

అతని గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్పాలనే ఉంది కానీ అతన్ని వివరించే మాటలు నా దగ్గర లేవు. కోహ్లీ తన బ్యాటింగ్ సొగసుతో ప్రేక్షకులను రంజింప జేస్తాడు అని చెప్పాడు. నా బ్యాటింగ్ స్తైల్ కి అతని బ్యాటింగ్ స్టైల్ కి చాలా తేడా ఉంది. అతని బ్యాటింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం. నేనలా ఆడదామని ప్రయత్నించినా అలా ఆడలేను అని చెప్పుకొచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: