క్రికెట్ లో టెస్ట్ కి ఉన్న ప్రాధాన్యతే వేరు. పొట్టి క్రికెట్ లో సిక్సర్లు బాదే ఆటగాళ్ళు, వన్డేల్లో సెంచరీలు చేసే ఆటగాళ్లు టెస్ట్ అనేసరికి కంగారు పడిపోతారు. క్రికెట్ లో ఒక మంచి ఆటగాడిగా ఎదగాలంటే టెస్ట్ క్రికెట్ ఆడటం చాలా ముఖ్యం. లేదంటే వన్డేలకే పరిమితం అయిపోయి అవకాశాలు సన్నగిల్లిపోతాయి. అయితే టెస్టులు చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడరు. సుదీర్ఘమైన ఇన్నింగ్స్ లు చూడాలంటే చాలా ఓపిక కావాలి.

 

అయితే టెస్టులకి పూర్వ వైభవం తీసుకురావడానికి డే నైట్ టెస్టులు ఆడాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు కోల్ కతాలో బంగ్లాదేశ్ తో జరిగే రెండవ టెస్ట్ లో భారత్ మొదటి పింక్ మ్యాచ్ ఆడనుంది. ఈ డే నైట్ టెస్ట్ మ్యాచ్ లో పింక్ కలర్ బంతిని ఉపయోగించడం ప్రత్యేకత. డే నైట్ టెస్ట్ లన్నీ పింక్ కలర్ బంతితోనే ఆడతారు. అయితే బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ తర్వాత ఇండియా ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచులు ఆడనుంది.

 

ఈ టెస్ట్ మ్యాచులు ఆడడానికి కోహ్లీ కొన్ని షరతులను పెట్టాడు. పింక్ బాల్ తో టెస్ట్ ఆడడానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్ తప్పకుండా ఉండాలని కోరాడు. ఇంతకుముందెప్పుడూ పింక్ బాల్ తో ఆడనందున ఆ బంతితో ప్రాక్టీస్ అవడానికి వీలుగా ప్రాక్టీస్ మ్యాచులు పెడితే బాగుంటుందని అంటున్నాడు. సడెన్ గా పింక్ బాల్ తో మ్యాచ్ పెట్టకుండా, ముందు ఆ బంతితో మ్యాచ్ ఆడితే మరింత బాగుంటుందని కోరాడు.

 

గత ఏడాది ఆసీసీ పింక్ బాల్ తో టెస్ట్ మ్యాచులకి ప్రతిపాదించినప్పుడు మేము కనీసం ప్రాక్టీస్ కూడా చేయలేదు. అసలు ఆ బంతొ ఎలా స్పిన్ అవుతుందో కూడా తెలియదు. అదీ గాక డే నైట్ మ్యాచ్ అంతే మంచు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందుగా ఒక సారి ఆ పింక్ బాల్ కి అలవాటు పడితే బాగుంటుందని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: