నేడు బంగ్లాదేశ్ తో జరగనున్న డే నైట్ టెస్ట్ మ్యాచులో పింక్ బాల్ ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. భారత టీమ్ కి పింక్ బాల్ తో  ఇది మొట్టమొదటి మ్యాచ్ కాబట్టి అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఇంతవరకు పింక్ బాల్ తో ఆడలేదు కాబట్టి ఈ సారి చాలా జాగ్రత్తగా ఆడడానికి సిద్ధమయ్యారు. అయితే పింక్ బాల్ తో మ్యాచ్ ఆడటం అంత సులభం కాదని తెలుస్తుంది. ముఖ్యంగా స్పిన్నర్లకి ఈ బంతి బాగా సహకరిస్తుందని తెలుస్తుంది.

 

అంతే కాదు ఫీల్డర్లకి ఈ బంతిని ఆపటం కష్టమవుతుందని కూడా అంటున్నారు. ఈ రోజు బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచులో పింక్ బాల్ ఉపయోగిస్తున్న నేపథ్యంలో భారత కెప్టెన్ కోహ్లీ పింక్ బాల్ తో ఆడితే ఎదురయ్యే సవాళ్ళను పేర్కొన్నాడు. ఈ మేరకు మీడియాతో కోహ్లీ మాట్లాడుతూ, పింక్ బాల్ తో ప్రాక్టీస్ చేశాం. ఆ బాల్ వైట్ బాల్ మరియు రెడ్ బాల్ కంటే బరువుగా ఉంది. దానివల్ల ఫీల్డర్లకి ఇబ్బందికరంగా ఉండనుంది. హాకీ బంతిలాగా చాలా బరువుగా ఉండడంతో ఫీల్డర్లకి బంతిని పట్తుకోవడం కష్టంగా మారనుంది. 

 

ముఖ్యంగా స్లిప్ లో ఉండే ఫీల్డర్లకి మరింత ఇబ్బందికరం. బ్యాటుకు తగలగానే బంతి వేగంగా వస్తుంది. అందువల్ల ఆ వేగంతో వచ్చిన బంతి చేతులని బలంగా తాకుతుంది. దీనివల్ల క్యాచులు మిస్సయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతే కాదు ముఖ్యంగా కీపర్ త్రో వేయాలంటే ఎక్కువ బలాన్ని ఉపయొగించాల్సి ఉంటుంది. వైట్ బాల్ తో క్యాచ్ పట్టేటపుడు బంతి ఎంత వేగంతో వస్తుందో ఒక అంచనా ఉంటుంది. దాన్ని బట్టి క్యాచ్ ని సులభంగా అందుకోగలం. 

 

కానీ పింక్ బాల్ చాలా వేగంగా వస్తుంది. కాబట్టి వేగాన్ని అంచనా వేయలేక క్యాచులు మిస్సయ్యే ప్రమాదం ఉంది. పింక్ బాల్ ఎక్స్ట్రా గ్లేజ్ వల్ల బంతి మరింత వేగంగా చేతులని తాకుతుంది. ఇలా పింక్ బాల్ తో ఫీల్డీంగ్ లో ఎక్కువ పొరపాట్లు జరుగుతాయని చెప్పాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: