భారత క్రికెట్ లో గబ్బర్ సింగ్ గా పేరు తెచ్చుకున్న ఆటగాడు శిఖర్ ధావన్. భారత క్రికెట్ లో అతడో సంచలనం. ఓపెనర్ గా దిగి విధ్వంసపు బ్యాటింగ్ తో స్కోరు బోర్డుని పరుగులు పెట్టిస్తాడు. బటు వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ తనదైన ఆటతో ప్రేక్షకుల మనసును గెలుచుకుంటాడు. వన్దే అయినా, టెస్ట్ అయినా తన ఆటతీరులో మాత్రం దూకుడు ఒకేలా ఉంటుంది. టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు కూడా టీ ట్వంటీ మ్యాచుని తలపించే ఆట ఆడటం ధావన్ కే సొంతం.

 

అయితే శిఖర్ ధావన్ టెస్ట్ మ్యాచ్ ఆడక చాలా రోజులవుతుంది. మళ్ళీ ఈ మ్యాచులకి సిద్ధం అవుతున్నాడు. అయితే ప్రస్తుతం ధావన్ మోకాలి గాయంతో ఆస్పత్రి పాలయ్యాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో ఢిల్లీ తరపున ఆడుతున్న అతడికి మోకాలి గాయం అయింది. దీంతో వెంటనే స్పందించిన బృందం వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించింది. ఈ మేరకు వైద్యులతో దిగిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 

 

దాంతో పాటు కొంచెం భావోద్వేగానికి కూడా లోనయ్యాడు. ఆ భావోద్వేగంలో అతడు మాట్లాడిన మాటలు అందరికీ ఉత్తేజం కలిగించేలా ఉన్నాయి. ఒక్కసారి ధావన్ ఏమన్నాడో చూస్తే, మనం అప్పుడప్పుడు కింద పడిపోతాం. అప్పుడపుడు ఆగిపోతాం. మళ్లీ అంతలోనే పైకి లేస్తాం. మనకు తగిలిన గాయాలని దాటుకుంటూ ముందుకి వెళ్ళిపోతాం. మనం చేయాల్సిందల్లా ఒక్కటే మనకొచ్చిన పరిస్థితికి మనమెలా స్పందిస్తున్నామో చూసుకోవాలి. 

 

ఆ సమయంలో మనల్ని మనం నియంత్రించుకోవాలి. జీవితంలో మనకెదురైన ప్రతీ సందర్భంలోనూ సంతోషంగానూ, సానుకూలతతోనూ ఉండాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. మరో నాలుగైదు రోజులు మీ ముందుకు వస్తాను అంటూ పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ తో ధావన్ అభిమానులకి ధైర్యాన్ని నింపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: