ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, బంగ్లాదేశ్ పింక్ బాల్ టెస్ట్ కోల్ కతాలో ప్రారంభమయ్యింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన ఈ మ్యాచ్ కు క్రికెట్ అభిమానులు భారీస్థాయిలో వచ్చారు. ఎంతోమంది ప్రముఖులు ఈ మ్యాచ్ చూడటానికి వచ్చారు. దీంతో పోలీసులు భారీ భద్రతా ఏర్పాటు చేశారు. 

 

ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంకు వచ్చారు. దీంతో ఈ మ్యాచ్ ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి షేక్ హసీనా మ్యాచ్ ను ప్రారంభించారు. కాగా ఈ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా వచ్చిన షేక్ హసీనాను బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆహ్వానించి అనంతరం ఆమెకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత ఆటగాళ్లను స్వయంగా పరిచయం చేశారు.

 

దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ టెస్టులో బాంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. షాద్మాన్ ఇస్లాం, ఇమ్రుల్ కేయీస్ ఓపెనర్లుగా బ్యాటింగ్ కు దిగారు.  కాగా ఈ మ్యాచ్ చూడటానికి ప్రత్యేక అతిథులుగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, షట్లర్ పీవీ సింధూ, షూటర్ అభినవ్ బింద్రా స్టేడియంకు వచ్చారు. 

 

కాగా ఈ మ్యాచ్ ఇండియాలో జరుగుతున్న తొలి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం, భారత జట్టుతో పాటు బంగ్లాదేశ్ సైతం పింక్ బాల్ తో తొలిసారిగా ఆడనుండటంతో, ఈ మ్యాచ్ ను అభిమానులు ఎంతో ఆసక్తికరంగా చూస్తున్నారు. తొలి మూడు రోజుల టికెట్లు ఇప్పటికే అమ్ముడై పోయాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: